ఎఫ్ 3 షూట్ లో స్పెషల్ బిర్యానీ ట్రీట్.. అలీ ఎంట్రీతో రచ్చ చేసిన యూనిట్!

కరోనా రెండో దశ కాస్త కుదుట పడడంతో ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో షూటింగ్ ల మొదలవుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాల షూటింగులు మొదలు పెట్టేశారు. రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించి వాడిని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వీలైనంత త్వరగా షూటింగ్ చేయాలని దర్శకనిర్మాతలు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో మళ్లీ ఎప్పుడు లాక్ డౌన్ పెడతారో తెలియదు కాబట్టి ప్రస్తుతం సడలింపులు ఉన్న సమయంలోనే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో ప్రస్తుతం ఎఫ్ త్రీ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది..

ఎఫ్ త్రీ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లుగా కొద్ది రోజుల క్రితం అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఫేవరెట్ కోబ్రాస్ తో షూట్ మళ్ళీ మొదలు పెట్టానని మెల్లగా మళ్లీ నవ్వులు మొదలు అంటూ ఆయన షేర్ చేశారు. అయితే ఆయన ఈరోజు షేర్ చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆలీ గారి ఇంట్లో వండించి తీసుకొచ్చి మాకు బిర్యాని వడ్డించారని చెబుతూ ఆలీ,సీత, కమెడియన్ సత్య అలాగే ఇతర యూనిట్ సభ్యులతో ఫోటో తీసుకుని మరీ ఆయన షేర్ చేశారు.

 Director Anil Ravipudi Shares Alis special Biryani Treat At F3 shoot

అయితే ఇప్పటి దాకా ఆలీ ఎఫ్ త్రీ సినిమాలో నటిస్తున్నట్లు ఎక్కడ లీకులు రాలేదు కానీ ఇప్పుడు ఈ పోస్ట్ తో ఆయన కూడా సినిమాలో నటిస్తున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆయన సినిమాలో నటిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఆ ఇచ్చిన బిర్యానీతో యూనిట్ మాత్రం పండగ చేసుకుందట. వెంకటేష్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహరీన్ జంటగా నటించిన ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ త్రీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎఫ్2 సినిమాని తెరకెక్కించిన దిల్ రాజు ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగబోతోంది అంచనాలతో ఉన్న ఈ సినిమా మీద గట్టిగానే బిజినెస్ చేయాలని ఆయన భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X