‘సమరసింహారెడ్డి షూట్ సమయంలో సీమలో ఫ్యాక్షన్ హత్యలు.. బాలకృష్ణ ప్రాణాలు అడ్డుపెట్టి.. ’

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు ఉన్నాయి. క్లాస్ , మాస్ తేడా లేకుండా అందరూ ఆయన సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. 50 ఏళ్ల కెరీర్‌లో పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. 60 ప్లస్‌లోనూ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ అదే ఎనర్జీతో దూసుకెళ్తున్నారు యువరత్న.

బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటి, ట్రెండ్ సెట్టర్ మూవీ సమరసింహారెడ్డి. టాలీవుడ్‌లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ఫ్యాక్షన్ చిత్రాలకే ఓ బెంచ్ మార్క్‌గా చెప్పుకునే చిత్రం సమరసింహారెడ్డి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్‌పెక్టర్ వంటి విజయాల తర్వాత బాలయ్య- బీ గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అల్‌టైమ్ హిట్. 1999 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లో రూ.16 కోట్ల నుంచి రూ.17 కోట్ల వసూళ్లను సాధించిందని అంచనా.

Director B Gopal made interesting comments on samarasimha reddy movie

నిజానికి ఈ సినిమాను చేయాల్సింది బాలయ్య కాదు.. విక్టరీ వెంకటేష్. ఆయనకే ఈ కథను వినిపించారు బీ గోపాల్.. వెంకీకి కూడా కథ బాగా నచ్చింది. అయితే ఆ తరహా చిత్రాలు తనకు సెట్ కావని చిరంజీవి లేదా బాలయ్యలతో చేయాల్సిందిగా బీ.గోపాల్‌కు వెంకటేష్ సలహా ఇచ్చారట. వెంకటేష్ చెప్పినట్లుగానే బాలయ్య తన స్టైల్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్‌ , నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సమరసింహారెడ్డి పాత్రలో బాలకృష్ణను తప్పించి మరో హీరోను ఊహించుకోలేనంతగా ఆ పాత్రకు జీవం పోశారు.

సమరసింహారెడ్డి కథను దర్శకుడు రాజమౌళి తండ్రి తన శిష్యుడైనప రత్నంతో కలిసి తయారుచేశారు. సింధూర పువ్వు చిత్రంలోని కాన్సెప్ట్‌ను తీసుకుని దానికి రాయలసీమలోని ఆధిపత్య పోరు, ముఠా తగాదాలు, పగలు, ప్రతీకారాలను యాడ్ చేశారు. భారతీయుల ఇతిహాసం మహాభారతంలోని విరాటపర్వంలోని భీముడి పాత్రలా హీరో పాత్రను రూపొందించారు. ఫ్లాష్ బ్యాక్‌లో హీరో పవర్‌ఫుల్ రోల్‌లో ఉండి.. అజ్ఞాతవాసంలో ఓ సాధారణ వ్యక్తిలా జీవించడమనే కాన్సెప్ట్‌ను అంతకుముందే హిట్టైన సూపర్‌స్టార్ రజనీకాంత్ భాషా నుంచి తీసుకున్నారు.

Director B Gopal made interesting comments on samarasimha reddy movie

సమరసింహారెడ్డి సినిమా రిలీజై పాతికేళ్లు గడుస్తుండగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు గోపాల్. మద్రాస్ మొజిల్లా రోడ్‌లోని ఎన్టీఆర్ నివాసంలో బాలయ్యకు కేవలం 25 నిమిషాలే కథ చెప్పానని వెంటనే ఓకే చేసేశారని ఆయన తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్, మిగిలిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షూటింగ్‌ కోసం కర్నూలు, కడప ప్రాంతాలకు వెళ్లాల్సి ఉందని.. అయితే ఆ సమయంలో కర్నూలులో ఓ హత్య , దానికి ప్రతీకారంగా దాడులు జరిగి రాయలసీమలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయని బీ గోపాల్ తెలిపారు.

దీంతో నిర్మాతల్లో ఒకరైన బాలయ్య తోడల్లుడు ప్రసాద్ రాయలసీమ షెడ్యూల్ క్యాన్సిల్ చేసి మరో చోట ప్లాన్ చేయమని చెప్పారని.. ఈ విషయాన్ని బాలయ్యతో మీరే చెప్పాలని నాకు పూరమాయించారని గోపాల్ వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌లో ఉన్న బాలయ్య దగ్గరికి వెళ్లి విషయం చెప్పగా.. మీ ప్రాణాలకు , యూనిట్ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు అని భరోసా ఇచ్చారని.. రాయలసీమలోని తెలుగుదేశం , ఇతర పార్టీల నేతలు, పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి అన్ని ఏర్పాట్లు చేశారని గోపాల్ చెప్పారు. బాలకృష్ణ ఇచ్చిన సపోర్ట్‌తోనే సమరసింహారెడ్డి అద్భుతంగా తీయగలిగామని బీ గోపాల్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X