ప్రేమలు బ్యూటీకి ఘోర అవమానం.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..
తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమా 'ప్రేమలు' అట్రాక్ట్ చేసింది. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. మంచి విజయం అందుకుంది. అలాగే.. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజు(Mamitha Baiju) ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. తన అందం, అభినయంతో యూత్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే.. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఈ అమ్మడుకు ఘోర అవమానం జరిగిందని ఓ ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? అసలేం జరిగిందో ఆ మూవీ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారట. ఇంతకీ ఏం జరిగిందంటే?
యంగ్ హీరోయిన్ మమత బైజు 'ప్రేమలు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఒక హిట్ తో మంచి పాపులారిటీ ని తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ బ్యూటీ .. తెగ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమలు తర్వాత ఈ అమ్మడు ఊహించిన స్థాయి కంటే ఎక్కువ అవకాశాలు అందుకుంటుంది. స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశాలు వస్తున్నాయంట. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఓ దర్శకుడి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ పేరున్న దర్శకుడు తాను తిట్టాడని అంతే కాకుండా చెయ్యి కూడా చేసుకున్నాడని తెలిపింది.

ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. తమిళ స్టార్ డైరెక్టర్ బాల దర్శకత్వం. తమిళ దర్శకుడు బాలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన టేకింగ్ ఎలా ఉంటుందో యావత్ సినీ ప్రపంచానికి తెలిసిందే. ఇటీవల ఆయన డైరెక్షన్ల తెరకెక్కుతున్న ఆ సినిమా హీరో సూర్య, హీరోయిన్ కృతి శెట్టి, యంగ్ హీరోయిన్ మమిత నటించారట. అయితే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ బాల మామితాను కొట్టాడని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై డైరెక్టర్ బాల క్లారిటీ ఇచ్చాడు. మమిత తన కూతురు లాంటిదనీ, అలాంటి అమ్మాయిని తాను ఎందుకు కొడతానని అన్నారు. బాలా మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలను ఎవరైనా కొడతారా ? ఆమె చిన్న పిల్ల ' అన్నారు. అయితే మేకప్ ఆర్టిస్ట్ బొంబాయి నుండి వచ్చారు. మమితకు షూట్ లేకుండా .. షూటింగ్ కు వచ్చింది. వారుఊరికే కూర్చున్నామంటూ మమితకి మేకప్ వేశారు. అయితే..విషయం డైరెక్టర్ కు నచ్చదు. ఆ విషయం మమితకు కూడా తెలుసు.



Click it and Unblock the Notifications











