twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమల కారణంగానే ఇదంతా.. ఆమె వల్లనే.. ‘ఎన్నారై’ డైరెక్టర్ ఎమోషనల్

    |

    కెఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై బాలరాశేఖరుని దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్‌ హీరోగా ప్రదీప్‌ కెఆర్‌ నిర్మిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'నాయనా రారా ఇంటికి (ఎన్‌.ఆర్‌.ఐ). ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటి అక్కినేని అమల క్లాప్‌ నివ్వగా, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఫస్ట్‌ షాట్‌ను బాలరాజశేఖరుని డైరెక్ట్‌ చేశారు. ఇంకా ఈ ప్రారంభోత్సవానికి హీరోలు నాని, సుమంత్‌, సుశాంత్‌, నాగశౌర్య, అఖిల్‌, మంచు లక్ష్మి, ప్రముఖ రచయిత, దర్శకుడు వి.విజయేంద్రప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అవసరాల శ్రీనివాస్‌, హీరోయిన్‌ మహతి, నటుడు నాగబాబు, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ, నిర్మాత ప్రదీప్‌ కె.ఆర్‌., దర్శకుడు బాలరాజశేఖరుని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

    ఎనర్జిటిక్ రొమాంటిక్ కామెడీ‌గా

    ఎనర్జిటిక్ రొమాంటిక్ కామెడీ‌గా

    దర్శకుడు బాలశేఖరుని మాట్లాడుతూ ''నాయనా రారా ఇంటికి అనడంలో రకరకాల అర్థాలు వస్తాయి. ఒక్కో రకమైన ఎమోషన్‌తో అంటూ ఉంటే ఒక్కో అర్థం వస్తుంది. అయితే నాయనా రారా ఇంటికి అని ప్రాధేయ పడే సినిమా కాదు. ఇది హైలీ ఎనర్జిటిక్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీ. అలాగే చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే ఫ్యామిలీ మూవీ. ఈ సినిమాకి పాటలు సీతారామశాస్త్రి గారు రాస్తున్నారు. వాళ్ళబ్బాయి యోగేశ్వరశర్మ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

    జిమ్‌ క్యారీగా, చార్లీ చాప్లిన్‌గా అవసరాల శ్రీనివాస్

    జిమ్‌ క్యారీగా, చార్లీ చాప్లిన్‌గా అవసరాల శ్రీనివాస్

    అవసరాల శ్రీనివాస్‌ ఓ జిమ్‌ క్యారీగా, చార్లీ చాప్లిన్‌గా, యంగ్‌ రాజేంద్రప్రసాద్‌గా చూద్దామని కోరుకుంటున్నాను. ఈ కథను శ్రీనివాస్‌ని దృష్టిలో పెట్టుకునే రాశాను. హీరోయిన్‌గా రకరకాల భాషల అమ్మాయిల్ని చూశాం. కానీ, తెలుగు మాట్లాడగలిగి ఉండాలి. తెలుగమ్మాయి అయి ఉండాలి. అందుకే భిక్షుగారి అమ్మాయి మహతిని సెలెక్ట్‌ చెయ్యడం జరిగింది.

     హాలీవుడ్ సినిమా రీమేక్‌ను వదిలేసి

    హాలీవుడ్ సినిమా రీమేక్‌ను వదిలేసి

    మొదట మేము రెండు సినిమాలు అనుకున్నాం. హాలీవుడ్‌ రీమేక్‌ ఒకటి కాగా, మరొకటి ఈ సినిమా. ఈ రెండింటిలో ఏది ముందు చెయ్యాలి అనే కన్‌ఫ్యూజన్‌లో బి.ఎ.రాజుగారి దగ్గరకు వెళ్ళాం. ఆయనకు 1500 సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. సినిమాల కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి, ఆడియన్స్‌ పల్స్‌ ఏమిటి అనేది బాగా తెలుసు. మేం అనుకున్న రెండు సబ్జెక్ట్స్‌ చూసి 'నాయనా రారా ఇంటికి' చెయ్యమని చెప్పారని బాలశేఖరుని వెల్లడించారు.

     అమల కారణంగానే ఇండియాకు వచ్చా

    అమల కారణంగానే ఇండియాకు వచ్చా

    నేను ఇండియా రావడానికి రీజన్‌ అక్కినేని అమలగారు. అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌కి డీన్‌గా వస్తారా అని అడిగారు. చాలా అదృష్టంగా భావించాను. చాలా సంతోషంగా ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను. ఈ స్కూల్‌లో డీన్‌గా పనిచేసి ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకొని ఈ సినిమా చేస్తున్నాను. అమలగారు మా సినిమాకి క్లాప్‌ ఇవ్వడం అనేది నా అదృష్టం. అమలగారికి, నాగార్జునగారికి, అక్కినేని ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు'' అన్నారు.

    English summary
    Actor Avasarala Srinivas latest movie Nayana Rara Intiki (NRI) has started. Directed by Bala Shekharuni. Produced by Pradeep KR. Nani, Amala, Sushanth, Naga Shourya, Akhil, Manchu Lakshmi are attendees for this opening ceremony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X