ఎస్వీ రంగారావు తర్వాత రాజేంద్ర ప్రసాద్ అంతటి గొప్ప నటుడు.. క్లైమాక్స్ డైరెక్టర్ భవానీ శంకర్ కామెంట్

దర్శకుడు భవానీ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో వెరైటీ సినిమాలు తీసిన ఏకైక నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆయన గొప్ప నటుడు ఎలా అయ్యారనే విషయం ఆయనతో పనిచేసిన తర్వాత అర్థమైంది. డైరెక్టర్ విజన్‌ను రాజేంద్ర ప్రసాద్‌ గారు బలంగా నమ్ముతారు. అందుకే ఆయనను వెరైటీగా గొప్పగా చూపించాలని అనుకొంటాను. ఈతరం నటుల్లో, హీరోల్లో విభిన్నమైన కథలు చెబితే.. కాంట్రవర్సి అని ఆపేస్తారు. కానీ రాజేంద్ర ప్రసాద్ అలాంటి నటుడు కాదు. విభిన్నమైన పాత్రలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అని డైరెక్టర్ భవానీ శంకర్ అన్నారు.

లైఫ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్ అంటే ఇంటెలిజెంట్ కాదు.. పవర్ ఫుల్ కాదు.. మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్ అంటే మోస్ట్ ఫ్లెక్సిబుల్ అని భవానీ శంకర్ అన్నారు. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తాతగా ఇలా ఎన్నో వెరైటీ పాత్రలను పోషించారు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎలాంటి పాత్రలోనైనా రాజేంద్ర ప్రసాద్ ఒదిగిపోతారు. అందుకే మీరు గొప్ప నటుడయ్యారు. నాకు తెలిసి లెజెండరీ యాక్టర్ ఎస్వీ రంగారావు తర్వాత మీరే సార్ అంటూ భవానీ శంకర్ ఎమోషనల్ అయ్యారు.

Director Bhavani Shankar about Rajendra Prasad in Climax

క్లైమాక్స్ సినిమా కేవలం గంటన్నర నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. మర్డర్ మిస్టరీగా వస్తున్న సినిమాలో పుష్కలంగా కామెడీ ఉంటుంది. కోవిడ్ సమయంలో మూడ గంటలపాటు థియేటర్లో ఉండకుండా గంటన్నరలోనే సినిమా ముగిస్తుంది అని భవానీ శంకర్ తెలిపారు.

క్లైమాక్స్ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రవి కుమార్ నీర్ల, మ్యూజిక్ రాజేశ్, నిద్వానా అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్, రవి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఎడిటర్ బసవ పైడిరెడ్డికి నా థ్యాంక్స్ అని భవానీ శంకర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X