twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పవర్’కు ఆరేళ్లు.. రైటర్ టు డైరెక్టర్‌ అంటూ బాబీ ఎమోషనల్

    |

    సినీ ఇండస్ట్రీలో ఓ వ్యక్తి దర్శకుడిగా మారాడం, వరుసగా సక్సెస్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. రచయితగా ఉంటూ.. ఎన్నో రోజులు ఎదురుచూసుకుంటూ ఉన్న బాబీకి పవర్ సినిమాతో దర్శకుడిగా మారే అవకాశం వచ్చింది. కొత్త వారిని ఎంకరేజ్, దర్శకులుగా పరిచయం చేయడం రవితేజకు ఉన్న అలవాటే. అలా రవితేజ ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు బాబీ.

    పవర్ సినిమాతో రవితేజలోని మాస్ కోణాన్ని మరోసారి బయటపెట్టాడు. పవర్ ఫుల్ డైలాగ్‌లతో, యాక్షన్ సీక్వెన్స్‌లతో దుమ్ములేపి మాస్‌కు ఉన్న పవర్ ఏంటో నిరూపించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో వెనువెంటనే ఆఫర్స్ వచ్చాయి. జై లవకుశ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. నేటికి పవర్ చిత్రం విడుదలై ఆరేళ్లు అవుతున్న సందర్భంగా బాబీ ఎమోషనల్ అయ్యాడు.

     Director Bobby About Power Completing six Years

    పవర్ అనే చిత్రం నా కెరీర్ గ్రాఫ్‌ను పూర్తిగా మార్చేసింది. రచయితగా ఉన్న నన్ను దర్శకుడిగా నిలబెట్టింది. నా హీరో రవితేజ లేకపోతే అది సాధ్యమయ్యేదే కాదు. అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం ఇచ్చిన తమన్‌కు థ్యాంక్స్. కోన వెంకట్, చక్రవర్తి, హన్సిక, రాక్ లైన్ వెంకటేష్, రెజీనా అందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యాడు. చివరగా బాబీ వెంకీమామ చిత్రంతో దుమ్ములేపాడు.

    English summary
    Director Bobby About Power Completing six Years, #Power is the film which completely changed my career graph from writer to director. This won’t be possible without my hero
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X