మెగా హీరో సినిమాతో... నిర్మాత అవతారం ఎత్తబోతున్న దర్శకుడు!

తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ లాంటి కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) ప్రస్తుతం వెంకటేష్, నాగ చైనత్య కాంబినేషన్లో 'వెంకీ మామ' అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటీ లేని ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నారు.

బాబీ త్వరలో రొమాంటిక్ మూవీని నిర్మించబతున్నారని, ఈ చిత్రానికి అరుణ్ పవార్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అరుణ్ పవార్ ఇంతకు ముందు 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' మూవీతో పాటు త్వరలో విడుదల కాబోతున్న 'వజ్ర కవచధర గోవిందా' చిత్రానికి దర్శకత్వం వహించారు.

Director Bobby all set to turn producer

బాబీ, అరుణ్ పవార్ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ను హీరోగా అనుకుంటున్నారట. 'వజ్ర కవచధర గోవిందా' ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత సాయికి స్క్రిప్టు వినిపించబోతున్నారని, ఎలాగైనా అతడిని ఒప్పించగలమనే కాన్ఫిడెన్సుతో ఉన్నట్లు తెలుస్తోంది.

బాబీ దర్శకత్వం వహిస్తున్న 'వెంకీ మామ' సినిమా విషయానికొస్తే... విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా నాయికలు. సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X