ఆయనో కర్మయోగి.. ఆ ప్రేమకు ఫిదా అయిపోయా.. పవన్ కళ్యాణ్‌‌పై డైరెక్టర్ ఎమోషనల్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్.. ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను ఒకసారి చూస్తే చాలు జన్మధన్యం అనుకునేవారు కోట్లలో ఉన్నారు. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా ఆయన ఫ్యాన్సే. బహిరంగ వేదికలపై పలుమార్లు పవన్ గొప్పతనం గురించి చెప్పినవారు ఎందరో. తాజాగా పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఓ స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ బాబీ మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నుంచి మొదలుపెట్టి మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిపై ఆయన అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీసి.. మెగాస్టార్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాగే చూపించి మెగా ఫ్యాన్స్‌‌కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు బాబీ. అంతేకాదు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో డల్‌గా ఉన్న చిరంజీవి గ్రాఫ్‌ను వాల్తేర్ వీరయ్యతో పెంచేశారు డైరెక్టర్ బాబీ.

Director Bobby Gets Emotional After Meeting Pawan Kalyan pens heartfelt note

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మరోసారి జత కట్టారు బాబీ. చిరు కెరీర్‌లో 158వ సినిమాగా చెబుతోన్న ఈ మూవీ కోసం మాస్ కథను సిద్ధం చేశారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి కూతురిగా మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ నటించనున్నారని టాక్. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న మెగా 158లో చిరంజీవి మాఫియా డాన్‌గా కనిపించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా.. మెగా 158 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో బిజీగా ఉన్న డైరెక్టర్ బాబీ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు పవన్‌ను కలిసిన ఫోటోలను పంచుకున్న బాబీ.. పవర్‌స్టార్‌తో కలయికపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం... ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు..

రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరగా ఒక్క మాట చెబుతున్నాను.. జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం... జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను.. జైహింద్ అంటూ బాబీ రాసుకొచ్చారు.

ప్రస్తుతం మెగాస్టార్‌తో సినిమా చేస్తున్న బాబీ.. ఉన్నపళంగా పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలిశారు అన్నది చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్‌తో సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆయనకు కథ చెప్పేందుకు వచ్చారా అంటూ గాసిప్స్ బయల్దేరాయి. అయితే కొందరు మాత్రం మెగాస్టార్ చిరంజీవితో తాను తెరకెక్కించనున్న మెగా 158 మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించడానికి బాబీ వెళ్లి ఉండొచ్చని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా.. గతంలో పవన్ కళ్యాణ్‌తో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని బాబీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X