మెగాస్టార్ చిరంజీవి కోసం మరో మాస్ టైటిల్
సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో బ్రేక్ వేసేలా కనిపించడం లేదు. నేటితరం హీరోల కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ ఫార్మాట్ లోనే మంచి సందేశాన్ని ఇచ్చేలా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ రానున్న రోజుల్లో మరింత బిజీ కానున్నారు. ఆచార్య అనంతరం మెగాస్టార్ మరో ముగ్గురు దర్శకులతో బిజీ కానున్నారు.
మలయాళం హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ ను మోహన్ రాజా దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత మెహర్ రమేష్ వేదాళం రీమేక్ తో బిజీ కానున్నారు. ఇక జై లవకుశ దర్శకుడు బాబితో చేయనున్న సినిమా కూడా కమర్షియల్ ప్యాకేజ్ తో రానుందట. ఆ సినిమాలో మెగాస్టార్ పవర్ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తాడట.

ఇక సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. దర్శకుడు బాబీ సినిమా కథకు తగ్గట్లు 'వీరయ్య' అనే టైటిల్ ను అనుకుంటున్నారట. సినిమాలో మెగాస్టార్ ఒక పల్లెటూరి వ్యక్తిగా కనిపించబోతున్నాడట. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ ఆడియెన్స్ కు నచ్చే విధంగా హై వోల్టేజ్ సీన్స్ కూడా ఉంటాయట. దర్శకుడు బాబీ మెగాస్టార్ ఇమేజ్ కు సరిపోయే విధంగా స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











