Just In
- 7 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 8 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 9 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 10 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫస్ట్ కిస్, ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ ఎలాగో.. రవితేజ కూడా అంతే : బాబీ కామెంట్స్
మాస్ మహారాజ్ రవితేజ పూర్తిగా మారిపోయి.. కొత్త కథను ఎంచుకుని చేసిన చిత్రం డిస్కోరాజా. ఎక్కడికి పోతావు చిన్నివాడ వంటి డిఫరెంట్ సినిమాను చేసిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తోన్న డిస్కోరాజా.. ఇప్పటికే పాటలు, టీజర్‌లతో ఎన్నో అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం జనవరి 24న విడుదలయ్యేందుకు సిద్దంగా ఉండటంతో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

చంటిగాడు లోకల్..
ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘మాస్ మహారాజ అభిమానులకు నమస్కారం.. ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తుంటారు..పోతుంటారు.. చంటిగాడు లోకల్.. ఆ చైర్ అక్కడే ఉంటుంది.. నాక్కూడా అరవాలని ఉంది.. కానీ ఆయన ఇక్కడ లేరు. రైటర్‌గా ఉన్న నన్ను పవర్ అని సినిమా ఇచ్చి నా ఇంటి పేరుగా చేశారు రవితేజ.

ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్..
ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్.. ఎలాగైతే గుండెల్లో గుర్తుండిపోతాయో.. రవితేజ కూడా అంతే. నాకు డైరెక్టర్‌గా చాన్స్ ఇచ్చిన రవితేజ గుండెల్లో ఉంటాడు. మాస్ అంటే బస్ పాస్ కాదు ఎవ్వడు పడితేవాడు వాడేసుకోవడానికి... రవితేజ ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి.. సినిమాలు చేస్తూనే ఉండాలి. దేవుడి గదిలో ఫోటో పెట్టుకునేంత మంచోడు రవితేజ.

రవితేజ మొదటి చాన్స్ ఇచ్చాడు..
చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కగలమని నమ్మకం ఉన్నా.. ఎవ్వరూ ఇవ్వరు పాడైపోతుందని.. కానీ రవితేజ నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు.. మనం ఎందరి వెనకో పడతాము.. కానీ ఏదో ఒక్క అమ్మాయే.. వీడు జీవితాంతం బాగా చూసుకుంటాడని మనల్ని నమ్ముతుంది. అలా రవితేజ నమ్మాడు.
తమన్‌కు క్లాస్ పీకారు..
డిస్కోరాజా విషయానికి వస్తే.. ఈ సినిమా పాటలను, టీజర్‌ను తమన్ దగ్గరి నుంచి దొంగతనంగా చూశాను.. ఆగలేక రవితేజకు చెప్పాను.. తమన్‌కు క్లాస్ కూడా పీకారు.. నేల టిక్కెట్ తరువాత రామ్ తాళ్లూరి గారు మళ్లీ రవితేజతో చేయాలని ఇంత కాలం వెయిట్ చేశారు..మీరు సాలిడ్ హిట్ కొట్టబోతోన్నారు.. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌లా ఉందని తమన్‌తో అంటే డిఫరెంట్ కాదు వేరే లెవెల్ అని అన్నాడు.. ఈ చిత్రం హిట్ కావాలి.. తమన్ ఇక్కడ లేడు.. 2019ని ఊపేశావు.. 2020 కూడా నీదే బ్రదర్'అంటూ ముగించాడు.