Acharya Pre Release Event: అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు.. ఆ సాంగ్ అద్భుతం: డైరెక్టర్ బాబీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆచార్య సినిమా ఈనెల 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మెగా ప్రొడక్షన్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తో వర్క్ చేస్తున్న మరికొంత మంది దర్శకులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాను డైరెక్ట్ చేస్తున్న బాబీ (KS రవీంద్ర) కూడా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఆయన తనదైన శైలిలో సినిమా గురించి మాట్లాడారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడికి వచ్చి మెగా అభిమానులందరికీ అలాగే టీవీలో ఈ వేడుకను చూస్తున్నా మెగా మహాసముద్రం అభిమానులందరికీ కూడా గుడ్ ఈవెనింగ్. చిరంజీవి గారి అభిమానిగా ఎక్కడో గుంటూరు లో పుట్టి పెరిగి ఆయన బ్యానర్లు కట్టి గోల చేస్తూ ర్యాలీలు చేస్తూ ఉన్న నేను.. ఆయన మీద ఉన్న పిచ్చి తో హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ఒక దర్శకుడిగా ఈ స్టేజ్ మీద మైకు పట్టుకునే వరకు వచ్చాను. దానికి ముందుగా మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన ద్వారానే ఇక్కడి వరకు వచ్చాను.

ఆ విషయాలను పక్కన పెడితే ఆచార్య సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారిని అలాగే రామ్ చరణ్ ఇద్దరినీ కూడా ఒకేసారి వెండితెరపైకి తీసుకువచ్చారు. ఇద్దరికీ సరిపోయేది కథ బలంతో మన ముందుకు వస్తున్నాడు. ఆయన కథ బలం ఏ విధంగా ఉంటుందో మేము ఎన్నో రోజులుగా చూస్తూనే ఉన్నాం.. ఆయన సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అభిమాన హీరోల ఇద్దరినీ కూడా వెండితెరపై అద్భుతంగా చూపిస్తున్నందుకు అభిమానుల తరపున నేను కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మనం చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానంతో చూసిన హీరో మెగాస్టార్ చిరంజీవిని ఈ రోజు లొకేషన్స్ లో అలా దగ్గర ఉండగా చూసినప్పుడు ఆయన లో ఎన్నో మంచి విషయాలను చూశాను. ఆయన ఏడు గంటలకు షూటింగ్ అంటే ఆరు గంటలకే మేకప్ తో రెడీగా ఉంటారు. వన్ మోర్ అని ఎన్నిసార్లు అన్నా కూడా ఆయన ఎందుకు అని అడగరు. RRR సినిమా బెనిఫిట్ షో కి మెగాస్టార్ చిరంజీవి తో పాటు నేను కూడా వెళ్లాను. అయితే ఆ తర్వాత చిరంజీవి గారు సెట్స్ లో ఉన్నప్పుడు చరణ్ గారు అద్భుతంగా చేశారు అని అన్నప్పుడు.. అందుకు మెగాస్టార్.. జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతంగా చేశాడు అని అన్నారు. ఆ ఒక్క మాట తోనే ఆయన రియల్ మెగాస్టార్ అని అనిపించింది.
ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా మెగాస్టార్ చేయిర్ మాత్రం అలానే ఉంది. ఒకసారి నేను చిరంజీవి గారు రాంచరణ్ గారు చేసిన సాంగ్ కూడా చూడడం జరిగింది. ఆ సాంగ్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. సినిమాకు మణిశర్మ గారు కూడా అద్భుతమైన సంగీతం అందించారు. ఇక సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు బాబీ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











