యువ డైరెక్టర్‌ లైన్‌లోకి దించిన చిరంజీవి.. హై స్పీడ్‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఖైదీ నంబర్ 150 సినిమా తర్వాత సైరా కోసం కాస్త గ్యాప్ ఎక్కువగానే తీసుకొన్న చిరంజీవి ఆ తర్వాత ఆచార్యతో ముందుకొచ్చారు. అయితే ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతుండగానే మెగాస్టార్ ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టారు. కొరటాల శివ ఆచార్య తర్వాత మరో ముగ్గురు యువ దర్శకులతో కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యారు.

సాహో దర్శకుడు సుజిత్‌తో లూసిఫర్ రీమేక్‌కు చిరంజీవి కసరత్తు చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత బాబీ, మెహర్ రమేష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే లూసిఫర్ రీమేక్‌పై దర్శకుడు సుజిత్ ఇప్పటికే ఓ దఫా స్క్రిప్టు వర్క్ పూర్తి చేశారు. అయితే ఆ చిరంజీవి ఆ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

Director Bobby to narrate the script to Chiranjeevi

ఇక బాబీ సినిమా స్క్రిప్టును కూడా కొలిక్కి తెచ్చేందుకు కూడా చిరంజీవి లాక్‌డౌన్‌లో బిజీగా మారిపోయారు. ఇటీవల కొన్ని మార్పులు చేయమని దర్శకుడు బాబీ సూచించగా ఆ పని ఇటీవల పూర్తి అయిందనే సమాచారం. త్వరలోనే బాబీ చేసిన మార్పులు, స్క్రిప్టును పూర్తిస్థాయి నేరేట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకొన్నట్టు సమాచారం.

ఇక బాబీ విషయానికి వస్తే ఎన్టీఆర్‌తో జైలవకుశ, వెంకటేష్, నాగచైతన్యతో వెంకీ మామ సినిమాను తెరకెక్కించారు. మూడో ప్రయత్నంగా చిరంజీవితో జతకట్టడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X