అఖండ తరువాత బోయపాటి ఫోకస్ మొత్తం ఆ స్టార్ హీరో పైనే.. త్వరలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్?

అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు బోయపాటి ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. అతనితో సినిమా చేయడానికి చాలామంది అగ్ర నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. స్టార్ హీరోలు కూడా బోయపాటి కథ సిద్ధం చేస్తే డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి ఫోకస్ మొత్తం ఒక స్టార్ హీరో పైన ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఆ హీరో చాలాసార్లు ఈ దర్శకుడికి మద్దతుగా నిలిచాడు. అందుకే ఆ కృతజ్ఞతతో మరోసారి బోయపాటి సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

 కథ ఓకే చేసే వరకు..

కథ ఓకే చేసే వరకు..

అఖండ సినిమా కంటే ముందు వరకు దర్శకుడు బోయపాటి లెవెల్ కాస్త తక్కువగానే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే వినయ విధేయ రామ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న బోయపాటి ఆ తర్వాత బాలకృష్ణ తో సినిమా సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అంతకుముందు కొంతమంది హీరోలు కూడా బోయపాటిని రిజెక్ట్ చేశారు. ఇక బాలయ్య తో సినిమా చేయాలని ఆయన కథ ఓకే చేసే వరకు చాలా రోజులు స్క్రిప్ట్ పై కూర్చున్నాడు.

 అఖండ సీక్వెల్

అఖండ సీక్వెల్

ఎలాంటి సినిమా చేసినా కూడా బోయపాటి మాస్ ఎలివేషన్స్ ఊహించని విధంగా ఉంటాయని అభిమానులకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అతని నుంచి అఖండ సినిమా తర్వాత ఎలాంటి సినిమా వస్తుంది అనే విషయంలో కూడా ఇప్పుడు అంచనాలు భారీగానే పెరిగాయి. ఆ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఇటీవల కథనాలు గట్టిగానే వచ్చాయి.

 సరైనోడు కాంబో

సరైనోడు కాంబో

ప్రస్తుతం రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా దర్శకుడు బోయపాటి మాత్రం ఒక స్టార్ హీరో కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. పుష్ప సినిమాతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న అల్లు అర్జున్ బోయపాటి తో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదివరకే వీరి కాంబినేషన్లో సరైనోడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దానికి ఎక్కువ సమయం పట్టదు

దానికి ఎక్కువ సమయం పట్టదు

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలో చేయాలని అనుకుంటున్నాడు. అతని లిస్టులో ప్రస్తుతం పుష్ప తో పాటు ఐకాన్ కూడా ఉంది. పుష్ప 2 సినిమాను కొనసాగిస్తూనే మరోవైపు బోయపాటి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కూడా బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు. పుష్ప సినిమా రెండో భాగం షూటింగ్ అయితే కేవలం 25 నుంచి 30 శాతం వరకు మిగిలి ఉంది. కాబట్టి దానికి ఎక్కువ సమయం పట్టదు.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా..

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా..

అందుకే వీలైనంత త్వరగా మాస్ కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉన్న కథ లో నటించాలని అల్లు అర్జున్ బోయపాటిని లైన్లో పెడుతున్నాడు. బోయపాటి కూడా ప్రస్తుతం తన స్థాయిని మరింత పెంచుకునే విధంగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకుంటున్నాడట. అఖండ సినిమా తర్వాత అంతకు మించి అనేలా ఉండాలి అని అల్లు అర్జున్ తో మరొక పాన్ ఇండియా మాస్ మసాలా యాక్షన్ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. మరి ఆ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X