నాలుగోసారి బాలయ్య - బోయపాటి కాంబో.. ప్లాన్ రెడీ చేస్తున్న యువ నిర్మాత?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొత్తానికి మరో బాక్సాఫీస్ బొమ్మ అందరిలోనూ కొత్త తరహా జోష్ నింపింది. రాబోయే సినిమాలకు కూడా ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. అఖండ సాధించిన విజయంతో దర్శకుడు బోయపాటి ఫామ్ లోకి రావడమే కాకుండా నందమూరి బాలకృష్ణ స్థాయి కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఇదివరకే రెండుసార్లు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న బాలయ్య అఖండతో హ్యాట్రిక్ కొట్టేశారు. నాలుగవ సారి కూడా ఈ కాంబోని కలిపేందుకు యువ నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఉహాలకందని రేంజ్ లో..

ఉహాలకందని రేంజ్ లో..

బోయపాటి శ్రీనివాస్ అనగానే అందరికీ కూడా ఎక్కువగా గుర్తుకు వస్తాయి అలాంటి దర్శకుడికి పవర్ ఫుల్ మాస్ హీరో దొరికితే ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఎలా ఉన్నా సరే బోయపాటి తనదైన శైలిలో మాస్ ఎలిమెంట్స్ తో అభిమానుల చేత విజిల్స్ వెయిస్తాడు. ప్రతీ సినిమాలో కూడా ఎలివేషన్స్ అయితే ఉహాలకందని రేంజ్ లో ఉంటాయని అఖండ సినిమాతో మరోసారి ఋజువు చేశారు.

అంతకుమించి అనేలా

అంతకుమించి అనేలా

బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా సింహా. అంతకుముందు వరకు కూడా బాలయ్య చాలా కాలం పాటు అపజయాలతో సతమతమవుతూ వచ్చాడు. ఇక సింహా దెబ్బతో బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేసేశారు. ఇక మళ్ళీ లెజెండ్ సినిమాతో ఒక్కటైన ఈ కాంబో అంతకుమించి అనేలా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. బాలయ్య కెరీర్ లో అప్పటి వరకు వచ్చిన సినిమాలకు అది పూర్తి విభిన్నమైన స్టైల్ లో ఉండడంతో జనాలు ఎగబడి చూశారు.

సాన్నిహిత్యం ఉండడంతో

సాన్నిహిత్యం ఉండడంతో

ఇక మూడవసారి ఈ కాంబినేషన్ కలిసేందుకు చాలా ఎక్కువ సమయం పట్టింది. దర్శకుడు బోయపాటి కూడా వరుసగా రెండు అపజయాలతో ఉండడంతో ఏ హీరో కూడా సినిమా చేసేందుకు సాహసం చేయలేదు. బాలకృష్ణతో మంచి సాన్నిహిత్యం ఉండడంతో చాలాసార్లు కథలపై చర్చలు జరిపారు. అయితే బోయపాటి ప్లాప్స్ కారణంగా కొందరు అతనితో సినిమాలు చేయవద్దని బాలయ్యకు చాలాసార్లు చెప్పారట.

యువ నిర్మాత చర్చలు

యువ నిర్మాత చర్చలు

కానీ బాలయ్య బోయపాటి పై నమ్మకంతో మూడవసారి అఖండ సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ హ్యాట్రిక్ కాంబో మరోసారి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హారిక హసినీ అనుబంధ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో చర్చలు జరుపుతున్నారట. యువ నిర్మాత నగవంశీ ముందు నుంచి బోయపాటితో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

సీక్వెల్ కూడా?

సీక్వెల్ కూడా?

ఇక నాలుగవ సారి కూడా ఈ కాంబినేషన్ అంతకు మించి అనేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే అఖండ బాక్సాఫీస్ వద్ద 80కోట్ల గ్రాస్ తో ఇండస్ట్రీలో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక నాలుగవాసరి సీక్వెల్ తో కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అఖండ పాత్రలో బాలయ్య రీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందనే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X