Akhanda2: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అఖండ 2 అసలు కథ ఇదే.. రివీల్ చేసిన బోయపాటి!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న బోయపాటి శ్రీను గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలు తెరకెక్కించే ఈయన 2005 నుంచి ఇప్పటికీ డైరెక్టర్ గా కొనసాగుతూనే వస్తున్నారు. భద్ర సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన... నటసింహం నందమూరి బాలకృష్ణతో ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ హిట్టే. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మూడు చిత్రాలు రాగా.. మరో సినిమా కూడా తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అది మరే సినిమానో కాదు అఖండ2. అయితే తాజాగా డైరెక్టర్ బోయపాటి ఈ సినిమా కథను రివీల్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బాలకృష్ణ, బోయపాటిల కాంబో గురించి.. దానికున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ ఉర్రూతలూగించే ఈ కాంబోలో తొలిసారి సింహ వచ్చింది. అది బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఆ తర్వాత నాలుగేళ్లకు లెజెండ్ సినిమా చేశారు. ఇది కూడా హిట్ గా నిలవగా.. ముచ్చటగా మూడోసారి అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ పర్ఫార్మెన్స్ చూసిన ప్రతీ ఒక్కరూ మీసాలు మెలేశారు. అలాంటి అద్భుతమైన చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబో మరోసారి ఓ అద్భుతమైన సినిమాతో రాబోతుంది.

Director Boyapati Srinu Reveal Akhanda 2 Movie Story Check Details

అయితే ఆ సినిమా మరేదో కాదు.. 2021లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్. అయితే బోయపాటి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ అఖండ 2 చేయబోతుండగా.. దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్లు లేవు. కానీ తాజాగా డైరెక్టర్ బోయపాటి ఈ సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఉందని అది పూర్తి కాగానే అఖండ 2 సినిమాపై అధికారక ప్రకటన చేస్తామని వివరించారు. అంతేకాకుండా ఈ సినిమా కథ దేన్ని అధారంగా చేసుకుని ఉంటుందో కూడా వెల్లడించారు.

అఖండలో పసిబిడ్డ, ప్రకృతి, పరమాత్మ కాన్సెప్ట్ లను చూపించామని.. దీని సీక్వెల్ అయిన అఖండ2లో కూడా సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుందని స్పష్టం చేశారు. దైవత్యం అనేది ప్రజలందరిలో ఒక భాగం అని దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని వివపించారు. ఇప్పటికే అఖండ2 సినిమాస్క్రిప్టు వర్క్ మొదలు పెట్టినట్లు తెలిపారు. ఇదంతా చూస్తుంటే అఖండ2.. పార్ట్ 1 ను మించి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Director Boyapati Srinu Reveal Akhanda 2 Movie Story Check Details

ఇదంతా ఇలా ఉండగా... ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తునే అంచనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాబీ డియోల్.. విలన్ గా చేయబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా తర్వాతే బాలకృష్ణ అఖండ2లో చేస్తారా.. లేక రెండు సినిమా షూటింగ్ లలో ఒకేసారి పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటారా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X