Pushpa 2 పై వచ్చిన వార్తలన్ని అబద్ధమే.. అంత సీన్ లేదని ట్వీస్ట్ ఇచ్చిన సుకుమార్ శిష్యుడు
ఉప్పెన సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన ఆ తర్వాత రెండవ సినిమా విషయంలో మాత్రం చాలా ఆలస్యంగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అతను పుష్ప 2 ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొన్నట్లుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా సుకుమార్ బుచ్చిబాబు చర్చించుకున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలపై దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 ప్లాన్
దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా తర్వాత రెండవ భాగం కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అసలైతే ఈపాటికే సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు కావాల్సింది. కానీ కొన్ని మార్పులు చేయడానికి మరి కొంత సమయం తీసుకున్న సుకుమార్ పక్కా ప్రణాళికతో షూటింగ్ మొదలుపెట్టాలి అని చూస్తున్నారు. ఆగస్టు నెలలోనే ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

పుష్ప 2 కోసం బుచ్చిబాబు
అయితే సుకుమార్ పుష్ప సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ విషయంలో కొంత దీర్ఘంగా ఆలోచిస్తూ తన శిష్యుడు బుచ్చిబాబు సహాయం కూడా తీసుకున్నట్లుగా ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ అది నిజమని అనుకున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలలో సుకుమార్ తో బుచ్చిబాబు చర్చలు జరుపుతున్నారు అన్నట్లు కనిపించింది.

ఎన్టీఆర్ తో సినిమా
బుచ్చిబాబు ఉప్పెన సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే కొన్నిసార్లు ఎన్టీఆర్ కు అతను కథ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎన్టీఆర్ ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇంకా అతను స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా మారిపోయాడు. అంతేకాకుండా మరోవైపు ఎన్టీఆర్ కూడా మిగతా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కాబట్టి బుచ్చిబాబుతో సినిమా చేయడానికి కొంత సమయం పట్టవచ్చు.

ఆ స్థాయి నాకు లేదు
ఈ క్రమంలో బుచ్చిబాబు ఖాళీగా ఉండకుండా పుష్ప సినిమాలో బిజీగా ఉన్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో నిజం లేదు అని బుచ్చిబాబు ఫైనల్ గా మరొక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే నిన్నా మొన్నటి వరకు వైరల్ అవుతున్న ఫోటోలపై కూడా అతను వివరణ ఇస్తూ తన గురువు కథలో కూర్చుని చర్చలు జరిపేంత స్థాయి తనకు లేదు అని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు.

నా కథ కోసం హెల్ప్
ఈ ఫోటో నేను తరువాత చేయబోయే నా సినిమా కథ చర్చల సందర్భంలోది. మాగురువుగారు సుకుమార్ సార్. నా కోసం నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ సార్ సినిమా కథలో కూర్చుని చర్చింతే స్థాయి నాకు లేదు రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు.. అని బుచ్చిబాబు సోషల్ మీడియాలో తెలియజేశారు.


Click it and Unblock the Notifications











