ఉప్పెన రీ షూట్.. సుకుమార్ గారు దోంగనా కొడకా అనేశారు.. అసలు విషయాన్ని బయటపెట్టిన శిష్యుడు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అంటే అన్ని వర్గాల ఆడియెన్స్ ఎంతగానో ఇష్టపడతారు. సాధారణంగా ఒక స్టార్ దర్శకుడి దగ్గర ఏళ్ల తరబడి పని చేసినా కూడా కొంతమందికి ఛాన్సులు రావు. కానీ సుకుమార్ దగ్గర నమ్మకంగా కష్టపడి పనిచేస్తే మాత్రం తప్పకుండా డ్రీమ్ నిజమవుతుందని నిరూపించారు. ఉప్పెన సినిమాతో ఆయన శిష్యుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

ఆర్య 2 నుంచి సుకుమార్ వద్దే..

ఆర్య 2 నుంచి సుకుమార్ వద్దే..

దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు అని అందరికి తెలిసిన విషయమే. ఇక అతను కేవలం సినిమా పరమైన శిష్యుడే కాదు. సుకుమార్ అధ్యాపకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ లో కూడా శిష్యుడే. పట్టుబట్టి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సుకుమార్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆర్య 2 నుంచి అతను సుకుమార్ సినిమాలకు సహాయక దర్శకుడిగా పని చేస్తున్నాడు.

సుకుమార్ సినిమాల స్క్రిప్ట్ విషయంలో..

సుకుమార్ సినిమాల స్క్రిప్ట్ విషయంలో..

కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ గానే కాకుండా రైటర్ గా కూడా సుక్కు సినిమాలకు వర్క్ చేశాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో అతని పాత్ర ఎంతగానో ఉంది. ఇక ఇండస్ట్రీలో తనతో పాటు తన అసిస్టెంట్స్ కూడా ఎదగాలి అనుకునే అతికొద్ది మంది దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన సపోర్ట్ తోనే బుచ్చిబాబు మొదటి సినిమా సెట్స్ పైకి వచ్చింది.

ఒక పెద్ద కొడుకులా..

ఒక పెద్ద కొడుకులా..

ఇక ఉప్పెన సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన విషయాలను చాలానే చెబుతున్నాడు. ఇక తన గురువు సుకుమార్ గురించి కూడా అనేక విషయాలను చెప్పాడు. తనను ఒక పెద్ద కొడుకులా చూసుకుంటాడని అన్నారు.

రీ షూట్ పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు

రీ షూట్ పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు

అయితే సినిమా కథ విషయంలో కొన్ని ఎడిటింగ్ లో లేపేశారని మరికొన్ని సుకుమార్ రీ షూట్ చేయించారని, రిపేర్లు చాలానే జరిగాయని కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా ఆ విషయంపై కూడా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశాడు. అలాంటిదేమి జరగలేదని ఒక్క షాట్ కూడా ఎడిటింగ్ లో లేపేయ్యలేదని అన్నాడు. సినిమా ఫ్రేమింగ్ కరెక్ట్ గా ఉండడానికి మాత్రమే కొంచెం ఎక్కువగా వర్క్ చేసినట్లు చెప్పాడు.

దొంగా నా కొడకా అనేశారు

దొంగా నా కొడకా అనేశారు

అయితే కథ రసుకున్నప్పుడు మార్పులు చెయ్యమని సుకుమార్ ఏమైనా చెప్పారా అనే ప్రశ్నపై కూడా స్పందించిన బుచ్చిబాబు ఆయన సరదాగా తిట్టినట్లు చెప్పాడు. ఓకవేళ నేను మార్చమని చెప్పినా కూడా నువ్ మార్చవురా దొంగా నా కొడకా.. బయటకు వెళ్లక మళ్ళీ నువ్వు అనుకున్నదే తీస్తావు అంటూ సుకుమార్ అనేవారని బుచ్చిబాబు వివరణ ఇచ్చాడు. అంతే కాకుండా ఎప్పుడైనా సరే మనం నమ్మిందే తీయాలి..అదే దర్శకుడి మొదటి లక్షణమని కూడా అదేనని సుక్కు సార్ చెబుతుంటారని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X