మరో సాహసం లాంటి కథ కూడా ఉంది: చెక్ దర్శకుడు

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరైన చంద్రశేఖర్ యేలేటి అంటే ఇప్పుడు యూత్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ దర్శకుడు ఇప్పుడు చెక్ సినిమాతో ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. నితిన్ - రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించిన చెక్ ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తోంది. అయితే దర్శకుడు చంద్రశేఖర్ శేఖర్ యేలేటి తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా ఒక క్లారటీ ఇచ్చేశాడు. గోపీచంద్ తో చేసిన సాహసం సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఆ సినిమా గోపిచంద్ కెరీర్ కు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది.

Director chandra sekhar yeleti about another adventure story

అయితే ఆ సినిమా తరహాలోనే మరో అడ్వెంచర్ కథను రెడీ చేసుకున్నట్లు చంద్రశేఖర్ యేలేటి చెప్పాడు. ఆ సినిమా అద్భుతంగా ఉంటుందని త్వరలోనే సెట్స్ పైకి రావచ్చని చెబుతూ.. కేవలం అడ్వెంచర్ కథ అనే కాకుండా మరొక డిఫరెంట్ లవ్ స్టొరీ కూడా రెడీగా ఉన్నట్లు చెప్పాడు. చెక్ సినిమా తప్పకుండా కమర్షియల్ గా మంచి కలెక్షన్స్ ఇస్తుందనే నమ్మకం తనకుందని, భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా మరింత డిఫరెంట్ ఉండబోతున్నట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X