ప్రముఖ దర్శకుడికి మాతృ వియోగం.. సినీ ప్రముఖుల పరామర్శ
అభ్యుదయ చిత్రాలతో సమాజానికి సందేశాలను అందించే ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఆయన తల్లిగారైన ధవళ సరస్వతి (86) జూలై 6 తేదీ శనివారం ఉదయం నర్సాపూర్‌లో కన్నుమూశారు.వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో విషాదంలో మునిగిన ధవళ సత్యం కుటుంబానికి సినీ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ధవళ సరస్వతికి దర్శకుడు ధవళ సత్యం ఆమె పెద్ద కుమారుడు. రెండో కుమారుడు ధవళ చిన్నారావు చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా, మూడవ కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగానూ చిత్ర పరిశ్రమలోనే స్థిరపడ్డారు.

నాలుగో కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు. కాగా తమ తల్లి అంత్యక్రియలు శనివారం సాయంత్రం నర్సాపూర్ లో జరుగుతాయని ధవళ సత్యం తెలియజేసారు.
సుబ్బారావుకు కోపం వచ్చింది, ఎర్రమట్టి, యువతరం కదిలింది, జాతర, ఎర్రమల్లెలు, చైతన్య రథం లాంటి సామాజిక ఇతివృత్తం ఉన్న చిత్రాలను రూపొందించారు.


Click it and Unblock the Notifications











