ఆ దురద తగ్గించుకో.. నీ జీవితానికి సున్నా చుట్టేస్తారు.. ప్రకాష్‌రాజ్‌కు టాప్ డైరెక్టర్ వార్నింగ్
ప్రాణ మిత్రుల్లా మెలిగిన ప్రకాష్ రాజ్- పవన్ కళ్యాణ్‌ల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం జరుగుతుండటం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్యనీయాంశమైంది. గతంలో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండగా.. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లారో అప్పుడే ఈ గొడవలు మారాయి. ఇద్దరివి వేర్వేరు భావజాలాలు కావడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.
బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ తొలి నుంచి లెఫ్ట్ భావజాలానికి దగ్గరగా ఉండేవారు. జర్నలిస్టులు, ఇతర మేధావులతో సమయం గడిపేవాడు. జర్నలిస్ట్, సామాజికవేత్త గౌరీ లంకేష్ దారుణ హత్య తర్వాత నుంచి రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు ప్రకాష్ రాజ్. బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే వారు. అలాగే కాషాయ దళానికి సన్నిహితులు, మిత్రపక్షాలను కూడా వదిలి పెట్టేవారు కాదు ప్రకాష్. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో భాగస్వామి కావడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. మిత్రుడు, తోటి కళాకారుడైనప్పటికీ పవన్‌ను కూడా వదిలిపెట్టలేదు ప్రకాష్ రాజ్.

పవన్‌పై తరచుగా విమర్శలు
సనాతనం ధర్మంపై పోరాటం, తిరుమలలో కల్తీ లడ్లూ ఇలా ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ వైఖరిని ఖండించారు. అంతేకాకుండా పవన్‌కు ఏం తెలియదని.. ఆయన జర్నీ ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణం లాంటిదని, మధ్యలోనే బీజేపీ దించేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ హిందీకి గట్టి మద్ధతు తెలపడంపై ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యారు. ఇంతగా అమ్ముడుపోతారా అంటూ సంచలన ట్వీట్ చేశారు. దీంతో జనసేన, బీజేపీ శ్రేణులు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
పబ్లిసిటీ దురద
తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్ని ఖండించారు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ. ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. మా ఎన్నికల్లోనే ఓడిపోయిన నువ్వు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సనాతనం ధర్మం గురించి మాట్లాడినా.. మరో మతం గురించి మాట్లాడినా అది రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు అని గీతాకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజ్‌కు పబ్లిసిటీ దురద ఉందని.. లైమ్ లైట్‌లో ఉండటానికి ప్రధాని నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై మాట్లాడుతున్నాడని గీతాకృష్ణ మండిపడ్డారు.
నీ కెరీర్‌కు సున్నా చుట్టేస్తారు
సినిమాలంటే ప్రకాష్‌రాజ్‌కు పిచ్చి అని.. ఇందుకోసం సొంత డబ్బులు వేస్ట్ చేసుకున్నాడని గీతాకృష్ణ ప్రశంసించారు. మోడీని విమర్శించేంత సీన్ ప్రకాష్‌రాజ్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మోడీ గారు అన్ని గమనిస్తూనే ఉంటారని, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారని గీతాకృష్ణ హెచ్చరించారు. పొలిటికల్‌గా ప్రకాష్ రాజ్ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వాల్సిన స్థాయి కాదన్నారు. మా ఎన్నికలు లాంటి సినిమా ఫీల్డ్‌లో ఉన్న చిన్న పాలిటిక్స్‌లోనే ప్రకాష్ రాజ్ గెలవలేకపోయాడని గీతాకృష్ణ దుయ్యబట్టారు.
ప్రకాష్ రాజ్‌కు ఎంతో మంది భవిష్యత్ ఉందని మంచి వేషాలు వేసుకుంటే అతనికి ఎదురు లేదన్నారు. కావాలని కొరివి పెట్టుకుని బీజేపీతో గొడవ పడటం కూడా వేస్ట్ అని ఎందుకంటే ఫైనల్‌గా అవార్డ్ ఇచ్చేది ఆ పార్టీయేనని గీతాకృష్ణ అన్నారు. ఢిల్లీకి లిస్ట్ వెళ్లిన తర్వాత అమిత్ షా గారు నీ పేరుకు సున్నా చుడితే నీ జీవితం ఫినిష్ అని హెచ్చరించారు. ప్రస్తుతం గీతాకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











