మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ .. తప్పంతా అల్లు అర్జున్‌దే : స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీకి మధ్య గ్యాప్ రోజు రోజుకు పెరిగిపోతున్నట్లుగానే కనిపిస్తోంది. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్, నంద్యాలలో వైసీపీకి ఎన్నికల ప్రచారం తదితర కారణాలతో బన్నీపై మెగా కాంపౌండ్ సైతం గుర్రుగా ఉంది. అదంతా మీడియా సృష్టే తప్పించి.. మెగా ఫ్యామిలీది ఎప్పుడూ ఒకే మాట, ఒకే బాట అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు అలాంటివి మరి.

మెగా ఫ్యామిలీతో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉండేవాళ్లు, అభిమానులు ప్రస్తుతం అల్లు అర్జున్ పేరు చెబితే చాలు భగ్గుమంటున్నారు. జబర్దస్త్ కిరాక్ ఆర్పీ అయితే శిల్పా రవికి అల్లు అర్జున్‌ సపోర్ట్ చేయడాన్ని తప్పుబడుతూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ విమర్శించారు. పవన్‌‌కు వ్యతిరేకంగా వైసీపీకి బన్నీ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించకపోయినా నేను స్పందిస్తానని చెప్పుకొచ్చారు. రెండ్రోజుల క్రితం గబ్బర్ సింగ్ ఫేమ్ సాయిబాబా అయితే అల్లు అర్జున్ ఉండే సినిమాలో తాను నటించనని కుండబద్ధలు కొట్టారు. సెలబ్రెటీలే ఇలా ఉంటే మెగా , పవన్ ఫ్యాన్స్ ఇంకెంత ఊగిపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

director geetha krishna made sensational comments on allu arjun and pushpa 2

మెగా , అల్లు కుటుంబాలతో అత్యంత క్లోజ్‌గా ఉండే నిర్మాత బన్నీ వాసు వ్యాఖ్యలు సైతం రెండు ఫ్యామిలీ మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లుగానే మాట్లాడారు. కుటుంబం అన్నాక కొన్ని అనుకోని పరిస్ధితులు వస్తుంటాయని, కానీ ఆ ఫ్యామిలీ మొత్తం ఏకతాటిపై ఉందని చెప్పడానికి చిన్న ఇన్సిడెంట్ చాలు అని.. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు బన్నీ వాసు తెలిపారు. హైపర్ ఆది అయితే అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ వద్దని సూచించారు.

ఈ విభేదాల మధ్య పుష్ప-2 సినిమా నలిగిపోతోందనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. గతంలో బన్నీ నటించిన ఓ సినిమాను పవన్, మెగా అభిమానులు తొక్కేశారని.. అలాంటిది ఇప్పుడు నంద్యాల ఘటనతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్ధితుల్లో పుష్ప-2ను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే నిర్మాతలు విడుదలను వాయిదా వేశారనే చర్చ జరుగుతోంది. లేదు లేదు దీనికి వేరే కారణాలు ఉన్నాయంటూ కొందరు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు.

director geetha krishna made sensational comments on allu arjun and pushpa 2

ఈ క్రమంలో పుష్ప-2 వాయిదా, అల్లు అర్జున్ వైఖరిపై ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. బన్నీ పబ్లిసిటీ పిచ్చి వల్లే కొంపముంచిందన్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ని పెట్టి సోషల్ మీడియాలో బజ్‌లో ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉంటారని గీతాకృష్ణ అన్నారు. పవన్ క్రేజ్‌ చిరంజీవిని మించిపోయిందని.. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా వెళ్లడం కరెక్ట్ కాదన్నారు.

పవర్‌స్టార్‌కు బన్నీ మద్ధతుగా ఉండి ఉంటే పుష్ప -2 క్రేజ్ ఓ రేంజ్‌‌లో ఉండేదని, పవన్ కళ్యాణ్ వదిలివెళ్లిన నెంబర్ వన్ ప్లేస్‌‌ను సొంతం చేసుకునే రేసులో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఉండేవాడని ఆయన చెప్పారు. బన్నీ చర్యల వల్ల నష్టపోయేది నిర్మాతలేనని.. ఇప్పటికైనా ఓ చిన్న ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇస్తే అతనికి చాలా రిలీఫ్ రావడమే గాక, నిర్మాతలను ఒడ్డున పడేసినవాడు అవుతాడని గీతాకృష్ణ హితవు పలికారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: pawan kalyan allu arjun pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X