యాంకర్ శ్యామల వొళ్లు దగ్గర పెట్టుకో.. హీరోయినా? బొంగేమి కాదు.. దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇతర కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలను కూటమి కేడర్ టార్గెట్ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోగా.. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు, ఆ పార్టీ మద్ధతుదారులపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. వీరిలో సినీనటి, యాంకర్ శ్యామల కూడా ఒకరు.
ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు శ్యామల. ఈ సందర్భంగా ఓ ఛానెల్‌లో మాట్లాడుతూ .. ముసలి తోడేలు, గుంట నక్క కథ చెప్పింది. ఇది పరోక్షంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించినదేనంటూ రెండు పార్టీ శ్రేణులు నోటికి పనిచెప్పాయి. సోషల్ మీడియాలో అయితే శ్యామలను దారుణంగా ట్రోలింగ్ చేశాయి. ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి రావడంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమెస్తోందని తనను బతకనీయండి అంటూ ఓ వీడియలో ఆమె విజ్ఞప్తి చేశారు.

అయితే శ్యామల వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని చంద్రబాబు, పవన్ అభిమానుల మనసులను తీవ్రంగా గాయపరిచింది. తాజాగా శ్యామల వ్యవహారంపై స్పందించారు దర్శకుడు గీతా కృష్ణ .తను నాకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ అని.. ఆమె రిక్వెస్ట్ పంపితే, అందంగా ఉందని యాక్సెప్ట్ చేశానని తెలిపారు. చంద్రబాబు, పవన్‌లపై శ్యామల చెప్పిన కథ గురించి తనకు తెలిసిందని.. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత తాను ' యాంకర్ శ్యామల ఎక్కడ..ఇప్పుడు చెప్పమను కథల్ని జగన్‌కి, అతను ఆర్జీవీని పెట్టి మరో ఫ్లాప్ తీస్తాడు ' అని ఫేస్‌బుక్‌లో పెట్టానని గీతా కృష్ణ వెల్లడించారు.
ఎన్నికల్లో ప్రచారం చేసినందుకు శ్యామలకు డబ్బులు ఇచ్చి ఉంటారని, లేదంటే మరేదో స్వలాభం ఉండి ఉంటుందని ఆయన ఆరోపించారు. వంగా గీత పిఠాపురంలో ఓడిపోతుందని తాను ఎప్పుడో చెప్పానని గీతా కృష్ణ తెలిపారు. శ్యామల ఎవరో కూడా జనానికి తెలియదని.. కానీ ఇప్పుడు ఆమె బ్యాడ్ అయిపోయారని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళితే ముఖంపై ఉమ్మేస్తారని ఆయన హెచ్చరించారు. కథ చెబుతానని ఓ తొట్టి కథ చెప్పిందని, పెద్ద తెలివైనదిలాగా ఓ కథ చెబుతుందా అని గీతా కృష్ణ మండిపడ్డారు.

జగనన్న .. జగనన్న అంటే ఇప్పుడు ఆయనకే అడ్రస్ లేదని .. భారతీ ఇంట్లోకి వెళ్లి భజన చేయాలని, అసలు రాజకీయాల గురించి ఆమెకు ఏం తెలుసు శ్యామల ఓ స్టుపిడ్ అని ఇకపై ఆమెకు అవకాశాలు రావన్నారు. అందంగా ఉన్నావని ప్రచారానికి పిలిచారని.. మొగుడిపై ఏవో కేసులు ఉన్నాయని శ్యామల వెళ్లుంటుందన్నారు. రేపు కాళ్లపై పడాల్సిందేనని లేదంటే కష్టమేనని గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద పొలిటిషియన్‌వా, లేదంటే హీరోయిన్‌వా .. ఏ బొంగు కాదు , ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని శ్యామలను ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం గీతా కృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











