రాజమండ్రిలో నీ యవ్వారాలన్నీ తెలుసు... పచ్చళ్ల పాప రమ్య మోక్షపై టాప్ డైరెక్టర్ వ్యాఖ్యలు
అలేఖ్య చిట్టి పికిల్స్... దీని గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరనే చెప్పాలి. రాజమండ్రికి చెందిన సుమ, అలేఖ్య, రమ్య కంచర్ల అక్కాచెల్లెళ్లు. వీరు ముగ్గురు కలిసి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్‌తో చేసే పచ్చళ్లు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించేవారు. అంతకంటే ముందే వీరిలో చిన్నమ్మాయి రమ్య సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా బాగా పాపులర్. హాట్ హాట్ ఫోటోషూట్‌లు, రీల్, వీడియోలతో ఈ అమ్మాయి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేది. ఇన్‌స్టాలో పాపులారిటీ తర్వాత వీరు అలేఖ్చ చిట్టి పికిల్స్ పేరుతో పచ్చళ్ల వ్యాపారంలోకి దిగారు. క్వాలిటీ, టేస్ట్ బాగుండటంతో వీరి బిజినెస్ బాగానే జరిగింది. అయితే ఓ రోజున ఓ కస్టమర్‌తో ఆన్‌లైన్‌లో చేసిన డిస్కషన్ వీరి వ్యాపారాన్ని దెబ్బకొట్టింది.
నెటిజన్లకు టార్గెట్‌గా అలేఖ్య చిట్టి పికిల్స్
పచ్చళ్ల ధర బాగా ఎక్కువగా ఉందని.. వాటిని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలని అడిగినందుకు ఈ రచ్చ జరిగింది. కస్టమర్‌కు నచ్చజెప్పే విధానంలో కాకుండా.. పచ్చళ్లే కొనలేని వాడివి రేపు భార్యకు బంగారం ఏం కొంటావ్ అంటూ అసభ్యంగా మాట్లాడింది అలేఖ్య చిట్టి. పచ్చళ్లు తర్వాత కొనొచ్చు కానీ .. ముందు కెరీర్‌పై ఫోకస్ పెట్టు అని దూషించింది. ఈ డిస్కషన్ తాలుకా ఆడియో క్లిప్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు అలేఖ్య చిట్టి పికెల్స్‌ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ దెబ్బకు అలేఖ్య క్షమాపణలు చెప్పడంతో వీరి వ్యాపారం కూడా మూసేశారు.

ఒక్క వివాదంతో పాపులారిటీ
అయితే ఈ వివాదం ఈ అక్కాచెల్లెళ్లను తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ చేసేసింది. ఏకంగా సినిమా వాళ్లు కూడా దీనిని తమ చిత్రాల్లో వాడుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. ఈ ముగ్గురిలో చిన్నమ్మాయి రమ్యకి సినిమాల్లోనూ ఆఫర్లు వచ్చినట్లుగా టాక్ నడిచింది. ఇక బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభమైన కొత్తల్లో కంటెస్టెంట్స్ లిస్ట్‌లో రమ్య పేరు వినిపించింది. సెప్టెంబర్ 7న నాగార్జునతో పాటు స్టేజ్ మీద రమ్య కనిపిస్తుందని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అయినప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ దారుల జాబితాలో రమ్యకి ఖచ్చితంగా ప్లేస్ దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి.
బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన రమ్య
దీనిని నిజం చేస్తూ ఐదో వారం చివరిలో బిగ్‌బాస్‌లోకి ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వారిలో రమ్య మోక్ష కూడా ఒకరు. వచ్చి రావడంతోనే ఆమె నెగిటివిటీ మూట కట్టుకుంది. పవన్ కళ్యాణ్, తనూజ సహా కొందరు కంటెస్టెంట్స్‌కి చెందిన వ్యక్తిగత విషయాలపై నోటికొచ్చినట్లు మాట్లాడటంతో ఆడియెన్స్ ఆమెపై మండిపడుతున్నారు. బ్యాచ్ బిచ్చింగ్‌తో పాటు నామినేషన్స్ సమయంలో సరైన రీజన్స్ చెప్పలేకపోవడం వంటివి రమ్యను ఈ వారం నామినేషన్స్‌లోకి తీసుకొచ్చింది. ఓటింగ్‌లోనూ రమ్యకు అతి తక్కువ ఓట్లు పడుతున్నాయి. మరి ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందో? లేక సేఫ్ అవుతుందో చూడాలి. అయితే రమ్య మోక్షపై సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
రాజమండ్రి క్యాండిడేట్
రీల్స్ చేసేటప్పుడు కార్నర్ ప్లేస్‌లో నిలబడి ఊపేస్తూ ఉండేది.. ఎవరు ఈ అమ్మాయి అని చూస్తే రమ్య గోపాల్ అని ఏదో ఉంది. నేను రాజమండ్రికి ఎప్పుడెళ్లినా మంజీరా సరోవర్ అనే స్టార్ హోటల్‌లో ఉండేవాడిని. అక్కడ రిసార్ట్స్‌లో ఉండే కుర్రాళ్లని ఈ అమ్మాయి ఎక్కడో కనుక్కోండి అన్నా. ఈ అమ్మాయి రీల్స్ చూస్తుండగా.. యూట్యూబ్‌లో ఒక వీడియో వచ్చింది. రాజమండ్రిలో ఓ మటన్ కొట్టు ముందు నిలబడి దాని గురించి వీడియో చేస్తోంది. వాడు కేజీ మాంసం ఇస్తానని అనుంటాడు.. అందుకే చేసేస్తుందేమో. అప్పుడే ఇది రాజమండ్రి క్యాండిడేటా అనుకున్నాను... మర్నాడు ఇంకో రీల్ చూశాను, మద్రాస్ బేస్డ్ గాగుల్స్ స్టోర్ గురించి చెబుతోంది. కారులో వెళ్తుండగా ఆమె చెప్పిన షాప్ కనిపించడంతో అక్కడికి తీసుకెళ్లమని డ్రైవర్‌కి చెప్పానని గీతా కృష్ణ అన్నారు.
ఆ ప్రాబ్లమ్ లేకపోతే ఇంకా అందం
డ్రైవర్ అక్కడికి తీసుకెళ్లడంతో ఇక్కడికి ఓ అమ్మాయి వచ్చిందని ఆరా తీయగా.. ఆ అమ్మాయి పేరు ఏంటీ? ఈ వివరాలు తెలుసుకున్నా. ఆ అమ్మాయికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడమని చెబితే.. ఫోనులో నా పేరు రమ్య అని చెప్పింది. నేను మంజీరా సరోవర్‌లో ఉంటాను.. చాలా కాలం నుంచి నీ రీల్స్ చూస్తున్నాను.. నువ్వు తెల్లగా బాగున్నావ్, నిన్ను సినిమాల్లోకి తీసుకెళ్తానని, కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్‌కు రమ్మని చెప్పా. దానికి మొహమాట పడ్డ ఆ అమ్మాయి.. మీరే మా ఇంటికి రండి అని పిలిచింది. అలా బాగోదని నువ్వే రా.. వచ్చేటప్పుడు అబ్బాయిలనో, తెలిసినవాళ్లనో తీసుకుని రమ్మన్నాను. నువ్వు చాలా బాగున్నావ్.. ఆ పళ్ల మధ్య గ్యాప్ పూరించాలని సలహా ఇచ్చా. హైదరాబాద్‌కు వస్తే చాలా మంచి డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నువ్వు ఇంకా బాగుంటావని చెప్పా. హోటల్‌కు రాలేదు.. నెల తర్వాత చూస్తే ఆ అమ్మాయి రీల్స్‌లో పళ్ల గ్యాప్ లేకుండా కనిపించింది అని చెప్పారు గీతాకృష్ణ.
ఎవడు చీప్ కాదు
వీళ్ల అక్క.. ఒకడిని అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. నిన్న ఆ అమ్మాయికి కామెంట్ పెడితే.. ఒకడు మీ లెవల్ ఏంటీ? ఆ అమ్మాచి చీప్‌ది అన్నాడు. ఎవరు చీప్ కాదు ఇక్కడ, సినిమా ఫీల్డ్‌లో యాక్ట్ చేస్తోన్న ఎవడు చీప్ కాదు.. నేను ఇలా ఆ అమ్మాయికి సజేషన్ ఇచ్చాను, దాని తర్వాత ఈరోజు బిగ్‌బాస్‌లోకి వెళ్లేంత క్రేజ్ సంపాదించింది. కెరీర్ మీద ఫోకస్ చేయమని వాళ్ల అక్క చెప్పింది... అంతకుమించి ఏం అనలేదు. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత మంచి డ్రెస్ వేసుకుని పోస్ట్ పెట్టింది. దాని కింద వచ్చిన కామెంట్స్‌కి నేను సరదాగా కామెంట్ పెట్టాను. ఓ సినిమాలో కూడా ఆ అమ్మాయికి ఆఫర్ వచ్చింది.. తన ప్రమోషన్స్ చేసుకుంటుండగా, పికెల్స్ ద్వారా మరింత పబ్లిసిటీ వచ్చింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు బాగుంటారు.. బాగుండాలి, డ్యాన్స్ చేయాలి, యాక్ట్ చేయడం రావాలి. ఆ చీప్ దానితోటి నీకెంటీ అంటున్నాడు.. ఎవడు చీప్ కాదిక్కడ, సో కాల్డ్ పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల కూతుళ్లు కూడా వస్తున్నారు' అంటూ గీతాకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











