విజయ్ కాకుండా మరో హీరోతో అఫైర్... ఆ సీక్రెట్ లీక్ చేసిన డైరెక్టర్

దాదాపు 25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు త్రిష కృష్ణన్. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోలకు త్రిష ఫేవరెట్‌గా మారారు. 42 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. అయితే త్రిష పెళ్లి వార్త ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. పలుమార్లు దీనిపై గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా త్రిష ఎఫైర్‌పై ఓ టాప్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చదువు తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు త్రిష. ఈ క్రమంలోనే మిస్ సేలం, మిస్ చెన్నై పోటీలలో పాల్గొని గెలుపొందారు. 2001లో మిస్ ఇండియా బ్యూటీఫుల్ స్మైల్ అవార్డును అందుకున్నారు. తర్వాత సినీరంగ ప్రవేశం చేసిన త్రిష... ప్రశాంత్ - సిమ్రన్ జంటగా నటించిన జోడీ (1999)లో తొలిసారిగా నటించారు. నీ మనసు నాకు తెలుసు మూవీతో తెలుగు వారిని పలకరించిన త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పూర్ణమి, స్టాలిన్, సైనికుడు, కృష్ణ, కింగ్, తీన్మార్, దమ్ము తదితర చిత్రాలతో టాలీవుడ్‌లోనూ సత్తా చాటుకున్నారు.

Director Geetha Krishna Sensational comments on Rana Daggubati and Trisha Krishnan affair

పెళ్లి పెటాకులు
కెరీర్ పీక్స్‌లో ఉండగా ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది త్రిష. ఇక రేపో మాపో పెళ్లి అనగా ఈ నిశ్చితార్దం క్యాన్సిల్ అయిపోయింది. దీనికి గల కారణాలు ఇవేనంటూ రకరకాలుగా పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఎంగేజ్‌మెంట్ తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉన్న త్రిష.. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస హిట్స్ కొడుతున్నారు. పొన్నియన్ సెల్వన్, థగ్స్ లైఫ్ చిత్రాలలో నటించారు. ప్రస్తుతం కరుప్పు, విశ్వంభర, రామ్ సినిమాలలో ఆమె నటిస్తున్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన త్రిష పెళ్లి గురించి గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.

త్రిష - విజయ్ రిలేషన్
ఇదే సమయంలో పెళ్లై, పిల్లలున్న ఓ స్టార్ హీరోతో త్రిష ఎఫైర్ నడుపుతున్నారంటూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. దళపతి విజయ్. తమిళనాట హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు త్రిష కృష్ణన్, దళపతి విజయ్. వీరిద్దరూ గతంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. అయితే త్రిష, విజయ్‌లు రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. విజయ్‌‌కి పాతికేళ్ల కిందటే సంగీతతో వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా విజయ్‌కి, సంగీతకి మధ్య విభేదాలు నడుస్తున్నాయని.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. విడాకుల తర్వాత త్రిషను పెళ్లి చేసుకుంటారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఆ హీరోతో త్రిష రిలేషన్?
తాజాగా త్రిష - విజయ్ రిలేషన్‌పై దర్శకుడు గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానాతో త్రిషకు ఎఫైర్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అసలు రానాతో ఎఫైర్ లేకపోతే న్యూస్.. వాళ్ల పనే అది, రానా .. రానా తమ్ముడు. పెళ్లయిన తర్వాత తగ్గి ఉంటారు కానీ, అంతకుముందైతే తగ్గేదే లేదు. జామ చెట్టుకు జామకాయలే కాస్తాయి.. రామానాయుడికి రామానాయుడు కొడుకులే పుడతారు. వాళ్లంతా ఎఫైర్స్ మాస్టర్స్. ఎన్నోసార్లు చెప్పాను.. రామానాయుడు గారంటే నాకు అందుకే ఇష్టం. ఫ్లైట్‌లో కూర్చొన్నప్పుడు ఆయన అక్కడ కూర్చొన్నారు, ఓ అమ్మాయి ఇలా సైగ చేస్తుంటే తెలుసు నాకు అని చెప్పారు. అందరికీ అఫైర్లు ఉంటాయి.. అందరికీ ఫ్రీగా వస్తే పినాయిల్ తాగే రకాలే..కానీ వాళ్లు మాత్రం ఇష్టపడరు. ప్రపంచంలో అమ్మాయిని టచ్ చేసి ఎంజాయ్ చేస్తే అతని వల్ల ఆమెకు లాభం కలిగి ఉండాలి. అటువంటి పాపం డేంజరస్ పాపం .. అది కొంతమంది పెద్ద పెద్ద నటులకు తగిలింది. వాళ్ల కుటుంబంలో కూడా వాళ్లకి వచ్చింది. ఫ్రీగా వస్తే పినాయిల్ తగినట్లుగా అమ్మాయిల్ని వాడేసుకున్న హీరోలు కొంతమంది ఉన్నారు... వాళ్లందరూ అనుభవిస్తున్నారు. ఇంకా అనుభవించకపోతే అనుభవించి చనిపోతారని గీతాకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X