టాప్ హీరోయిన్‌తో ఎఫైర్.. డబ్బులతో సెటిల్మెంట్.. త్రివిక్రమ్‌పై ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిల్మ్ రైటర్ గా మొదలై దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక త్రివిక్రమ్ తన కెరీయర్ ప్రారంభం నుంచి టాప్ హీరోలతోనే పని చేయడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి వారితో కలిసి ఎక్కువ చిత్రాలకు పని చేశాడు. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. కాగా, తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ హీరోయిన్ తో తనకున్న సంబంధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
టాప్ డైరెక్టర్ గా త్రివిక్రమ్..
తెలుగు చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ఆయన డైలాగ్స్, కథ, ఫిలాసఫికల్ థిమ్, హ్యూమర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ అతడు చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో జల్సా, ఖలేజా, జూలాయి, అత్తారింటికి దారేది, సన్ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత వీర రాఘవ, గుంటూరు కారం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మెప్పించారు.

పవన్ కళ్యాణ్, మహేశ్ సినిమాలతో ప్రశంసలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లతో త్రివిక్రమ్ నడిపించిన లవ్ ట్రాక్ బాగుంటుంది. వీరిద్దరి నట ప్రదర్శనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ చిత్రం ద్వారానే వీరిద్దరితో కలిసి తొలిసారిగా పనిచేశారు త్రివిక్రమ్. త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశంతో ఇద్దరూ హీరోయిన్లు మరింతగా రైజ్ అయ్యారు. ఈ చిత్రానికి ముందు మహేశ్ బాబుతో అతడు అందించి భారీ బ్లాక్ బాస్టర్ అందించారు.
డబ్బులతో సెటిల్ మెంట్ : గీతా కృష్ణ
జల్సా చిత్రం తర్వాత ప్రముఖ హీరోయిన్ తో త్రివిక్రమ్ కు ఎఫైర్ నడిచిందని టాలీవుడ్ డైరెక్టర్ గీతా కృష్ణ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆమెకు మహేశ్ బాబు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడని అందుకని పెద్ద గొడవ జరిగిందన్నారు. దాంతో ఆమెకు డబ్బులిచ్చి మరీ సెటిల్ మెంట్ చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గీతా కృష్ణ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
త్రివిక్రమ్ రాబోయే చిత్రాలు..
చివరిగా త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలో గుంటూరు కారం చిత్రం వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం మరోసారి అల్లు అర్జున్ తో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ బన్నీ త్రివిక్రమ్ కు హ్యాండిచ్చాడు. AA22xA6 ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. మరోవైపు త్రివిక్రమ్ నెక్ట్స్ సినిమా విక్టరీ వెంకటేశ్ తో ఉండబోతోందని తెలుస్తోంది. ఈప్రాజెక్ట్ ను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











