రవితేజతో సినిమా చేయలేం.. ఇప్పుడైతే కష్టం.. గోపీచంద్ మాలినేని

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలతో థియేటర్లలో సందడి చేశారు. ఇక నెక్స్ట్ మాస్ జాతర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి భాను భోగవరాజు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలా రవితేజ సరసన మరొకసారి నటించింది. ఈ చిత్రం మే 9న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రవితేజ గురించి ఒక ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పారు.

గోపీచంద్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు..
ప్రస్తుతం మాస్ డైరెక్టర్గా టాలీవుడ్ లో దుమ్ము లేపుతున్న గోపీచంద్ మాలినేనికి తొలి సినిమా దర్శకత్వ అవకాశం ఇచ్చింది మాస్ మహారాజ రవితేజ నే. మీరి కాంబినేషన్లో మొదటిసారిగా డాన్ శీను అనే చిత్రం వచ్చింది. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఆ తర్వాత బలుపు అనే చిత్రం కూడా వచ్చి బ్లాక్ బస్టర్ అందించింది. దాని తర్వాత క్రాక్ సినిమా వచ్చి కమర్షియల్ హిట్టును అందించింది. ఇలా వీరి కాంబినేషన్లో మూడు చిత్రాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవితో కలిసి రవితేజ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించి మంచి సక్సెస్ ను పండుకున్నారు.

Director Gopichand malineni gave Clarity on movie stopped with Raviteja

గోపిచంద్ మలినేని రవితేజ 4వ చిత్రం..
వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గోపీచంద్ మలినేనికి దర్శకుడిగా మంచి మార్కెట్ ఏర్పడింది. ఆయన సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో మరోసారి గోపీచంద్ మలినేని మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో నాలుగవ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 2024 లో RT4GM అనే వర్క్ టైపింగ్ కూడా అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది. కానీ ఎందుకు ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ స్పష్టమైన కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు.

రవితేజతో సినిమా ఆగిపోవడంపై..
గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో రావలసిన నాలుగవ సినిమా ఆగిపోవడం టాలీవుడ్లో ఒక చర్చగా మారింది. ఎందుకు ఆగిపోయింది అనే విషయాలు తెలియక అభిమానులు కూడా అప్సెట్ అయ్యారు. తాజాగా గోపీచంద్ మలినేని ఆ సినిమా ఆగిపోవడంపై స్పందించారు. రవితేజతో సినిమా ఆగిపోవడానికి కారణం బడ్జెట్ విషయంలో పలు సమస్యలు వచ్చాయని తెలిపారు. అందుకే ఇప్పట్లో రవితేజతో సినిమా తీయలేకపోయానని చెప్పారు. కానీ భవిష్యత్తులో తప్పకుండా రవితేజతో సినిమా చేస్తానని మాస్ మహారాజా అభిమానులకు హామీని ఇచ్చారు.

గోపీచంద్ మలినేని రీసెంట్ ఫిలిం..
తెలుగులో మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న తర్వాత గోపీచంద్ మలినేని బాలీవుడ్ బాట పట్టారు. రీసెంట్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నిధిలో సన్నీ డియోల్ తో జాట్ అనే చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద 112 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇంకా వసూలను రాబడుతూ ఉంది. అయితే రవితేజ తో చేయవలసిన సినిమా అదేనా అని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X