అప్పటి వరకు రాజమౌళిని పట్టించుకోలేదు.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌కే పరిమితమైన తెలుగు సినిమాను ప్యాన్‌ ఇండియా స్థాయికి, ఆపై గ్లోబల్‌ మార్కెట్‌కు తీసుకెళ్లిన ఘనత ఆయనదే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జక్కన్న, ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించబోతుండటంతో ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇలాంటి సక్సెస్‌ఫుల్ దర్శకుడిపై తాజాగా టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 'ఒక్కడు', 'రుద్రమదేవి' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుణశేఖర్, ప్రస్తుతం తన దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ సోషల్ డ్రామా యుఫోరియా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

Director Gunasekhar Says Eega Is SS Rajamouli s Best Film Calls It a Creative Benchmark

గుణశేఖర్ మాట్లాడుతూ.. రాజమౌళి కెరీర్‌లో తనను నిజంగా ఫిదా చేసిన సినిమా ఈగ అని స్పష్టం చేశారు. ఈగ సినిమా వరకు రాజమౌళి వర్క్‌ను అంతగా గమనించలేదు. అప్పటివరకు ఆయన సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్‌ అయినప్పటికీ, కంటికి సరిగ్గా కనిపించని ఒక ఈగను హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది అసాధారణం. అదే నాకు రాజమౌళిపై నిజమైన గౌరవాన్ని తెచ్చింది" అని అన్నారు. 'కంటికి కనిపించడమే కష్టం అయిన ఈగను CGI ద్వారా జీవంగా క్రియేట్ చేయడం, దాని చుట్టూ ఎమోషన్ పండించడం, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. 'అబ్బా... ఏం సినిమా తీశాడు రా బాబు' అని తొలిసారి ఫీలయ్యాను. రాజమౌళి ఓల్డ్ కెరీర్‌లో నాకు బెస్ట్ సినిమా ఇదే' అని గుణశేఖర్ కొనియాడారు.

అదే సమయంలో 'ఈగ'పై రాజమౌళి గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తుకొస్తున్నాయి. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ వద్ద సహాయకుడిగా ఉన్న రోజుల నుంచే ఈగ కథపై చర్చ జరిగిందని, మొదట అది సరదాగా వచ్చిన ఐడియా మాత్రమేనని జక్కన్న వెల్లడించారు. 'సింహాద్రి', 'ఛత్రపతి' వంటి భారీ సినిమాల తర్వాత ఒక చిన్న ప్రయోగాత్మక సినిమా చేయాలనే ఆలోచనతో 'ఈగ'ను అభివృద్ధి చేశామని చెప్పారు. చిన్న బడ్జెట్‌గా మొదలైన ఈ సినిమా కథ ముందుకు సాగేకొద్దీ స్కేల్ పెరిగి, చివరకు సంచలన విజయంగా నిలిచింది.

నాని, సమంత, సుదీప్ కీలక పాత్రల్లో నటించిన 'ఈగ', బలహీనుడైన ఒక చిన్న ప్రాణి బలవంతుడైన మనిషిపై ప్రతీకారం తీర్చుకునే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు అంగీకరించేలా చేసింది. ఇదే సినిమాను రాజమౌళి విజన్‌కు బెంచ్‌మార్క్‌గా గుణశేఖర్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుణశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాజమౌళి అభిమానులు కూడా 'ఈగ'ను జక్కన్న కెరీర్‌లో ఒక మాస్టర్‌పీస్‌గా గర్వంగా గుర్తుచేసుకుంటున్నారు. ఒక గ్రాఫిక్ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఆ విజన్‌నే రాజమౌళిని ప్రపంచస్థాయి దర్శకుడిగా నిలబెట్టిందన్న అభిప్రాయం మరింత బలపడుతోంది.

More from Filmibeat

Read more about: ss rajamouli gunasekhar eega
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X