గుణ శేఖర్ శాకుంతలంలో స్టార్ కిడ్ కి అవకాశం.. ఆ ఇద్దరి స్టార్స్ వారసులలో ఎవరు?

చివరిగా రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుణశేఖర్ ప్రస్తుతం సమంత హీరోయిన్ గా శాకుంతలం అనే ఒక మైథలాజికల్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహాభారతం కంటే ముందు జరిగిన కొన్ని ఘటనలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా గుణశేఖర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎద అందాలతో కవ్విస్తోన్న లోఫర్ బ్యూటీ దిశా పటానీ

ఆసక్తికర వ్యాఖ్యలు

ఆసక్తికర వ్యాఖ్యలు

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే/ ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతునిగా నటిస్తున్నారు. అయితే ఈ మధ్య గుణశేఖర్ పుట్టిన రోజు తర్వాత నుంచి వరుసగా టీవీ ఛానల్స్ కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

 సమంతను అనుకోలేదు

సమంతను అనుకోలేదు

నిజానికి ఈ సినిమాలో అసలు ముందు సమంతను హీరోయిన్ గా అనుకోలేదని ఈ పాత్రలో ఎవరు సరిపోతారని వెతుకుతున్న నేపథ్యంలో సమంత అయితే బాగుంటుందని తన కూతురు నీలిమ సూచించిందని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. అయితే ముందు కాస్త సందేహించానని ఆయన అన్నారు.

 సమంత 100% కరెక్ట్

సమంత 100% కరెక్ట్

ఆ తర్వాత వెళ్లి సమంత ను కలిసిన వెంటనే తనకు కూతురి నిర్ణయం మీద నమ్మకం వచ్చిందని షూటింగ్ మొదలుపెట్టాక కూతురు నిర్ణయం 100% కరెక్ట్ అనిపించింది అని చెప్పుకొచ్చారు. సమంత అందిస్తున్న సహాయ సహకారాలు ఎప్పటికీ మరిచిపోలేవని పేర్కొన్న ఆయన కేవలం సమంత వల్లనే 50 శాతం షూటింగ్ పూర్తయిందని అన్నారు.

త్వరలో మొదలు

త్వరలో మొదలు

ఇప్పటికే మే 10వ తేదీ వరకు షూటింగ్ చేశామని తర్వాత లాక్ డౌన్ వల్ల ఆపేసినా ఇప్పుడు ఒంటిగంట వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే మరో పెద్ద సెట్ నిర్మాణం ప్రారంభించామని చెప్పుకొచ్చారు.. వీలైనంత త్వరలో భారీ సెట్ పూర్తి కావడం ఆ వెంటనే షూటింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ సమయంలోనే ఇంటర్వ్యూయర్ ఒక ఆసక్తికర ప్రశ్న సంధించారు.

 ఎన్టీఆర్ కొడుకా, అల్లు అర్జున్ కొడుకా ?

ఎన్టీఆర్ కొడుకా, అల్లు అర్జున్ కొడుకా ?

ఆరోజుల్లో బాల రామాయణం తీసి రికార్డు సృష్టించారని, మరి ఈ సినిమాలో భరతుడి చిన్నప్పుడు పాత్ర కోసం ఎవరిని నటింప చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది కాబట్టి ఎన్టీఆర్ కొడుకునా ? లేదా అల్లు అర్జున్ తో మంచి అనుబంధ ఉండడంతో ఆయన కొడుకుని పరిచయం చేస్తున్నారా అని ప్రశ్నించారు.

 స్టార్ కిడ్ ను

స్టార్ కిడ్ ను

ఈ ప్రశ్నకు గుణ శేఖర్ కూడా ఆసక్తికరంగా స్పందించారు. తనకు ఇప్పటి వరకు అలాంటి ఉద్దేశం లేదని కానీ మీరు చెప్పేది కమర్షియల్గా బాగానే ఉంటుందని అన్నారు. వాస్తవానికి భరతుడు చిన్నప్పటి పాత్ర ఒక స్టార్ కిడ్ ను డిమాండ్ చేస్తుందని, అయితే అది ఎవరు అని చెప్పడానికి ఇది సమయం కాదని ఆయన అన్నారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఇంకా లేదని ఆయన వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X