గద్దలకొండ గణేష్‌ను పవన్ కల్యాణ్ చూశాడా? అంటే హరీష్ శంకర్ జవాబు ఏంటంటే!

'జిగర్తాండ' ఆధారంగా గద్దలకొండ గణేష సినిమా వరుణ్‌తో చేస్తున్నాం..అన్నప్పుడు వరుణ్‌ ఏ క్యారెక్టర్‌ చేస్తాడు అని కూడా అడగకుండా నిర్మాతలు రామ్, గోపి ఆచంట వెంటనే రైట్స్‌ తీసుకున్నారు. నేనంటే వాళ్లకు అంత నమ్మకం. ఈ 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌ నా సినిమాతో స్టార్ట్‌ అవడం సంతోషంగా ఉంది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం 'గబ్బర్ సింగ్' ఫంక్షన్ ఇక్కడే జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఈ సక్సెస్ ఫంక్షన్ జరగడం హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ మీట్ ను ఇంత భారీగా జరిపినందుకు శ్రేయాస్ మీడియా వారికి కృతజ్ఞతలు అని వాల్మీకి సక్సెస్ మీట్‌లో హరీష్ శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సత్య, రచ్చ రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌ హరీష్‌ కట్టా తదితరులు పాల్గొన్నారు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వచ్చే వారంలో ఈ సినిమా చూస్తారు. మేమందరం సినిమాను ప్రేమించాం అందుకే సినిమా మమల్ని ప్రేమించింది అని హరీష్ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

director Harish Shankar emotional at Valmiki success meet

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ - '' మా 'గద్దల కొండ గణేష్‌' సినిమాకు మంచి అప్రిసియేషన్ రావడం వల్ల సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. విజయవాడలో స్టార్ట్ చేశాం. ఈరోజు వైజాగ్ తో టూర్ ముగిస్తున్నాం. సినిమాని నాకు పరిచయం చేసింది వైజాగ్. నేను నటనలో శిక్షణ తీసుకుంది కూడా ఇక్కడే. మా గురువు గారు సత్యానంద్ గారి దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ విధంగా సినిమా వల్ల నాకు వైజాగ్‌కి గొప్ప రిలేషన్‌షిప్ ఏర్పడింది. మీ అందరూ సినిమాను ప్రేమించినంత కాలం మేము మంచి సినిమాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం.. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. హరీష్ గారు బాబాయ్ కి 'గబ్బర్ సింగ్' తో ఎంత మంచి సినిమా ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అంత పెద్దది కాకపోయినా నాకు 'గద్దల కొండ గణేష్' ఇచ్చారు.

గద్దలకొండ గణేష్ సినిమాతో అధర్వ నాకు మరో బ్రదర్‌ అయ్యారు. ఐనాంక బోస్‌ విజువల్స్‌ చాలా బాగున్నాయి. పూజ నా ఫస్ట్‌ హీరోయిన్‌. మా ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి చాలా కష్టాలు పడ్డాం. కొన్ని సార్లు షూటింగ్ ఆపేసారు. రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా ఒక మంచి సినిమా మీకివ్వాలనే సంకల్పం మమల్ని ముందుకు నడిపింది.

సినిమా డబ్బు, పేరు ఇస్తుంది అని విన్నాం.. కానీ ఇంత ప్రేమ ఇస్తుంద‌ని ఇలా మీ అందర్నీ చూస్తుంటే అనిపిస్తుంది. మీ అభిమానం చూస్తుంటే ఎంత చేసిన తక్కువే అనిపిస్తుంది. మీ అభిమానం కోసం నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. ఇంత పెద్ద హిట్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి థాంక్స్. నేను చాలా సార్లు బాబాయ్ పేరు చెప్పగానే మీరు అరుస్తుంటే నేను స్టేజ్ కి అటువైపు ఉండాలి కదా అనుకునే వాడిని. నా నెక్స్ట్ సినిమా షూటింగ్ ఇక్కడే చేస్తున్నాను. త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని వరుణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X