హీరో వరుణ్ తేజ్‌కు ఛాలెంజ్ విసిరిన డైరెక్టర్ హరీష్ శంకర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రసీమ దర్శకుడు హరీష్ శంకర్ సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తన ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి మీడియాతో మాట్లాడారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ- ''ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చేపట్టిన ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రజలందరూ మొక్కలు నాటాలని కోరుతున్నాను. అలాగే నా బాల్యమిత్రుడు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా నేను హీరో వరుణ్ తేజ్ ని నామినేట్ చేస్తున్నా" అన్నారు.

కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిథులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగా, గ్రీన్ ఛాలెంజ్ విషయానికి వస్తే.. ఎంపీ సంతోష్ కుమార్ కొద్దికాలంగా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఛాలెంజ్ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











