సర్కారు వారి పాట ట్రైలర్ పై పవన్ కళ్యాణ్ డైరెక్టర్ మాస్ రివ్యూ.. గేట్ రెడీ అంటూ..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ సాంగ్స్ సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నేడు విడుదల చేస్తున్నారు. అందరికంటే దర్శకుడు హరీష్ శంకర్ సినిమా ట్రైలర్ చూసి సోషల్ మీడియాలో మరింత హైప్ క్రియేట్ చేశాడు.
ట్రైలర్ చూశాను.. అంటూ మహేష్ బాబు యొక్క అసమానమైన స్వాగ్ మామూలుగా లేదని.. డైరెక్టర్ పరశురామ్ తన రచన, టేకింగ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని.. గెట్ రెడీ గైస్ ఇది ఫీస్ట్.. అని హరీష్ శంకర్ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. దర్శకుడు హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ లో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ నిర్మాతలతో ఉన్న అనుబంధం తో సర్కారు వారి పాట సినిమాకు సంబందించిన ట్రైలర్ ను కూడా ప్రత్యేకంగా వీక్షించాడు.

ట్రైలర్ బాగా నచ్చేసింది తప్పకుండా అభిమానులకు ఈ సినిమా ఒక సెలబ్రేషన్ లా ఉంటుంది అని కూడా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనిపిస్తోంది. మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా యూట్యూబ్ లో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేశాయి. ముఖ్యంగా కలవతి పాట 150 మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం విశేషం.

ఇక సినిమా ట్రైలర్ కూడా యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకుల్లో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమాను మొదటిరోజు మొదటి షో చూడాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా మొదటి రోజే ఈ సినిమా ఉహించని విధంగా ఓపెనింగ్స్ అందుకుంటుందని ఆడియన్స్ నమ్మకంతో ఉన్నారు. త్వరలోనే మహేష్ బాబు కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ తో బిజీ కాబోతున్నాడు. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోందో చూడాలి. ఇక మహేష్ సర్కారు వారి పాట అనంతరం త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











