నిర్మాతగా మారిన హరీష్ శంకర్.. తొలి సినిమా అవకాశం ఎవరికో తెలుసా?

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తన కెరీర్‌లో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు దర్శకుడి బ్లాక్‌బస్టర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హరీష్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారంలో కనిపించనున్నారు. ప్రేక్షకుల అభిరుచి మారుతున్న నేపథ్యంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను రూపొందించాలనే లక్ష్యంతో నిర్మాతగా మారినట్టు సమాచారం.

దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూనే మంచి కథాంశాలతో సినిమాలు రూపొందించాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు టాలీవుడ్‌లో మరో నిర్మాత మహేష్ కోనేరుతో కలిసి సంయుక్తంగా సినిమాలు నిర్మించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.

Director Harish Shankar turns as producer with Mahesh Koneru

నిర్మాతగా మారిన తర్వాత దర్శకుడు హరీష్ కుమార్ ప్రణీత్ అనే యువ దర్శకుడితో తొలి మూవీని నిర్మించనున్నట్టు సమాచారం. గతంలో నిహారిక కొణిదెల నటించిన సూర్యకాంతం అనే సినిమాతో ప్రణీత్ దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సూర్యకాంతం సినిమాకు ముందు నాన్న కూచీ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

క్రైం, కామెడీ అంశాలు కలిసి ఉన్న కథ ఇటీవల హరీష్, మహేష్ కోనేరుకు వినిపించగా వారు సంతృప్తి చెంది సినిమాను రూపొందించడానికి ముందుకు వచ్చినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసి.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక దర్శకుడిగా హరీష్ శంకర్ త్వరలోనే పవన్ కల్యాణ్‌తో ఓ మూవీని, అలాగే ప్రముఖ నిర్మాత రూపొందించే మరో సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X