For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Thrigun కిరాయి ఫస్ట్ లుక్ అదుర్స్.. ఇంటెన్సిటీకే బాప్ అంటూ ఆర్జీవీ పొగడ్తల వర్షం

  |

  త్రిగున్ బర్త్ డే సందర్బంగా "కిరాయి" ఫస్ట్ లుక్ & టైటిల్ ను లాంచ్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ చీకటి గదిలో చిలక్కొట్టుడు, 24 కిస్సెస్, డియర్ మేఘ, తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో రూపొందిన సంచలన చిత్రం కొండా చిత్రంలో హీరోగా నటించిన యువ నటుడు త్రిగున్ తాజాగా కిరాయి అనే చిత్రంలో నటించారు. SAY క్రియేషన్స్, ARK ఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్ పతాకంపై VRK, దర్శకత్వంలో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి ఉయ్యూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  గుంటూరు బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని 1995, 2003, 2020 సంవత్సరాల్లో గుంటూరు, పల్నాడులో కిరాయి హత్యల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది. హీరో త్రిగున్ బర్త్ డే సందర్బంగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ కిరాయి చిత్రంలోని రస్టిక్, రగ్గడ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  Director Harish Shankar unveils Thriguns Kirayi first look, RGV Tweets

  కిరాయి పోస్టర్‌ను దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేసి.. త్రిగున్‌ ఫస్ట్ లుక్‌పై పొగడ్తలు గుప్పించారు. వావ్ త్రిగున్.. కిరాయి సినిమా ఫస్ట్ లుక్ చూస్తే.. ఇంటెన్సిటీకి ఫాదర్‌గా కనిపిస్తున్నావు. పోస్టర్ చూసిన తర్వాత సినిమా పెద్ద హిట్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. చిత్ర యూనిట్‌కు నా అభినందనలు అని ఆర్జీవి ట్వీట్‌లో తెలిపారు.

  ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్బంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. త్రిగున్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. తను చాలా ఎనర్జీటిక్ హీరో. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ చూశాను చాలా బాగుంది. మొదటి సారి డిఫరెంట్ సబ్జెక్టు అట్టెంప్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అన్నారు.

  చిత్ర దర్శకుడుV. R. K,(రామకృష్ణ) మాట్లాడుతూ.. కిరాయి సినిమా రష్, ఫస్ట్ లుక్ చూసిన రాంగోపాల్ వర్మ చాలా బాగుందని మెచ్చుకొన్నారు. ఈ సినిమాకు మంచి టెక్నిసియన్స్‌తోపాటు చక్కని ప్యాడింగ్ ఉంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా. ట్రాన్స్‌ఫార్మర్ బద్దలయితే ఎలా ఉంటుందో ఆలా హెవీ యాక్షన్‌తో ఆడియన్స్ కు థ్రిల్ ఇవ్వ బోతున్నాం అని అన్నారు.

  చిత్ర నిర్మాత అమూల్య రెడ్డి యలమూరి మాట్లాడుతూ.. కిరాయి సినిమా కోసం గుంటూరు సబ్ జైల్లో, చంచల్ గూడ, చర్లపల్లి జైల్లల్లో కిరాయి హత్యలు చేసే వారి గురించి director రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు, బాధలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయని తెలుసు కొన్నాం. కిరాయి టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమా టైటిల్, పోస్టర్స్ హరీష్ శంకర్‌కు, వర్మ గారికి బాగా నచ్చాయి అని చెప్పారు.

  Director Harish Shankar unveils Thriguns Kirayi first look, RGV Tweets

  నిర్మాత నవీన్ రెడ్డి వుయ్యూరు మాట్లాడుతూ..హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఇది. ా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. మా చిత్ర హీరో త్రిగున్ గారి బర్త్ డే రోజున డైరెక్టర్ హరీష్ శంకర్ టైటిల్‌ను రిలీజ్ చేశారు. వారికి మా ధన్యవాదాలు అని అన్నారు.

  సాంకేతిక నిపుణులు:
  బ్యానర్స్: SAY క్రియేషన్స్, ARK ఆర్ట్స్, సినీ ఫ్యాన్ విజన్, జయ పుత్ర ఫిల్మ్స్
  నిర్మాతలు: అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరు
  సహ నిర్మాతలు: బి. గురువరావు, పి. సీతారాం,
  దర్శకుడు: V . R. K,
  ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
  డీవోపీ: సుజాత సిద్ధార్థ్,
  రీరికార్డింగ్: ఓషో వెంకట్,
  సంగీతం: హరి గౌర,
  డైలాగ్స్: భరత్ కుమార్ పోగుల,
  సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్
  పీఆర్వో : మధు వీఆర్

  English summary
  Director Harish Shankar unveils Thrigun's Kirayi first look, RGV Tweets that, Wowwwww ⁦Thrigun_Aactor ⁩ ,you are looking like the father of intensity in this new film of urs #Kirayi ..All the best to ur team and if this poster is any indication am sure this film will be as red hot as the tip of that cigarette
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X