అల్లు అర్జున్ కొత్త ఆఫీస్.. సందర్శించిన డీజే డైరెక్టర్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల జూబ్లీహిల్స్ లో కొత్త ఆఫీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతంలో బన్నీ తన సినిమా కార్యక్రమాల కోసం, చర్చల కోసం గీత ఆర్ట్స్ ఆఫీస్ నే ఉపయోగించుకునేవాడు. కానీ తాజాగా తన సొంత ఆఫీస్ ని ప్రారంభించాడు. ఇకపై బన్నీ సినిమాకు సంబందించిన చర్చలు మొత్తం ఇక్కడే జరుగుతాయి.
తాజగా బన్నీ కొత్త ఆఫీస్ ని గబ్బర్ సింగ్, డీజే చిత్రాల మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ సందర్శించాడు. ఆఫీసులో ప్రతి అంగుళం అల్లు అర్జున్ ఆలోచనలకూ అద్దం పడుతుందని అభిప్రాయపడ్డాడు. బన్నీ సినిమాల గురించే ఆలోచించడానికి ఇది సరైన ప్రదేశం అని హరీష్ శంకర్ తెలిపారు.

హరీష్ శంకర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో డీజే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. నా పేరు సూర్య చిత్రం తరువాత అల్లు అర్జున్ మరో చిత్రం ప్రారంభించలేదు. బన్నీ కొత్త చిత్రం విక్రమ్ కుమార్ దర్శత్వంలో కానీ, త్రివిక్రమ్ దర్శత్వంలో కానీ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











