బీరు సొంతంగా తయారు చేసుకోవాలని ఉందా?.. అయితే హుషారు చూడాలట!
టాలీవుడ్‌లో కొత్త తారలతో, తక్కువ బడ్జెట్‌తో భారీ విజయాలను అందుకొన్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్. మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాలు ఆయన అభిరుచికి అద్దంపట్టాయి. తాజాగా మళ్లీ కొత్తవాళ్లతో రూపొందించిన సినిమా హుషారు. తేజస్ కంచర్ల, ప్రియా వడ్లమాని, రాహుల్ రామకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. హుషారు చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు వస్తున్న రెస్పాన్స్‌ను, సినిమా రిలీజ్ గురించి వివరించడానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఇటీవల హుషారు మీడియా సమావేశంలో దర్శకుడు హర్ష మాట్లాడుతూ.. నలుగురు బీరు ప్రియుల కథ ఇది. బీరు తాగడాన్ని అమితంగా ఇష్టపడే యువకుల జీవితాల్లో చోటుచేసుకొన్న ఒడిదుడుకులు, వాటిని ఎలా అధిగమించారనే కథతో తెరకెక్కించాం అని అన్నారు.

హుషారు సినిమాలో బీరు ఎలా తయారు చేసుకోవచ్చో అనే పద్దతిని చూపించాం. ఈ సినిమా చూస్తే సొంతంగా బీరు తయారు చేసుకోవచ్చు అని హర్ష తెలిపారు. అలాగని ప్రేక్షకులకు మద్యం తాగమని మేం చెప్పడం లేదు. ప్రోత్సహించడం కూడా లేదన్నారు. సినిమా మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుకెళ్తుంది. రాహుల్ రామకృష్ణ పాత్ర సినిమాకు వెన్నముకగా నిలుస్తుంది అని తెలిపారు.


Click it and Unblock the Notifications











