'కృష్ణగారు సూపర్ స్టార్ అయితే, విజయ నిర్మల లేడీ సూపర్ స్టార్’
''కృష్ణగారు సూపర్ స్టార్ అయితే, విజయ నిర్మల లేడీ సూపర్ స్టార్. ఇండస్ట్రీలో ఆవిడ ఒక చరిత్ర. బాలనటిగా మొదలు పెట్టి 200 సినిమాల్లో నటించారు. 50 సినిమాలు కృష్ణతో చేశారు. ఒక హీరోతో 50 సినిమాలు చేసిన చరిత్ర ఏ హీరోయిన్‌కు లేదు.'' అని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు.
44 సినిమాలకు డైరెక్షన్ చేశారు. రఘుపతి వెంకయ్య అవార్డ్ సొంతం చేసుకున్నారు. ఒక లేడీ దర్శకురాలిగా ప్రపంచం అంతా తెలిలా ఘనత సాధించారు. గ్లామర్ పరంగా, అభినయం పరంగా ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచారు. విజయ నిర్మల లేని లోటు చలన చిత్ర సీమకు ఎంత ఉందో నాకు తెలుసు. కృష్ణ గారిని తలుచుకుంటే ఎంతో బాధగా ఉందని రాఘవేంద్రరావు అన్నారు.

విజయ నిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. పలువురు తెలుగు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. సూపర్ స్టార్ ఇంటి వద్ద భారీగా అభిమానులు గుమిగూడారు. విజయ నిర్మల భౌతిక కాయాన్ని గురువారం మొత్తం అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. శుక్రవారం అంత్యక్రియలు చిలుకూరులోని ఫాంహౌస్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయ నిర్మల నట ప్రస్థానం 7 ఏళ్ల వయసులోనే మొదలైంది. హీరోయిన్‌గా 60కిపైగా చిత్రాల్లో నటించిన ఆమె.... ఎక్కువగా కృష్ణతో కలిసి చేశారు. 'సాక్షి' సినిమాలో తొలిసారి కలిసి నటించిన వీరు ప్రేమలో పడ్డారు. 1969లో పెళ్లి చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











