రాఘవేంద్రరావు చేతుల మీదుగా బ్యాక్‌డోర్ ట్రైలర్.. హీరోయిన్ పూర్ణ మూవీపై పెరిగిన అంచనాలు!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‌గా, టెలివిజిన్ హోస్ట్‌గా అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న పూర్ణ నటించిన చిత్రం బ్యాక్ డోర్. పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన 'బ్యాక్ డోర్' చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి "క్లీన్ యు" సెన్సార్ సర్టిఫికెట్ లభించడం తెలిసిందే.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్ రిలీజ్ తర్వాత బ్యాక్ డోర్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇలాంటి సానుకూల వాతావరణంలో ట్రైలర్ రిలీజ్ వేడుకను టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు చేతుల మీదుగా నిర్వహించారు. బ్యాక్ డోర్ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి యూనిట్‌కు అభినందనలు అందించారు.

బ్యాక్ డోర్ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. కచ్చితంగా బ్యాక్ డోర్ సినిమా విజయం సాధించాలి. నిర్మాతలకు మంచి లాభాలు రావాలి. దర్శకుడికి మంచి పేరు తీసుకు వస్తుంది. నటీనటులకు మంచి అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ.. బ్యాక్ డోర్ సినిమా టీజర్‌కు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. టీజర్ కంటే ట్రైలర్‌కు కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బ్యాక్ డోర్ సినిమా ట్రైలర్ ఆవిష్కరించినందుకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించినందుకు దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సాంకేతిక విభాగం వివరాలు
కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ,
పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్
కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ
పాటలు: నిర్మల, చాందిని
సంగీతం: ప్రణవ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్
ఆర్ట్: నాని
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్,
కెమెరా: శ్రీకాంత్ నారోజ్,
ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్ కోట
పిఆర్వో: ధీరజ్ అప్పాజీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ,
కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను,
సమర్పణ: సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి
రచన, దర్శకత్వం: కర్రి బాలాజీ!!


Click it and Unblock the Notifications











