త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో విభేదాలు.. బద్దం భాస్కర్ వివాదంపై నోరు విప్పిన స్టార్ డైరెక్టర్
20వ శతాబ్ధం ఆరంభంలో తన సినిమాలతో తెలుగువారిని అలరించారు దర్శకుడు కే. విజయ్ భాస్కర్. స్వయంవరం నువ్వు నాకు నచ్చావ్, నువ్వేకావాలి, మల్లీశ్వరి, మన్మథుడు వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో టాలీవుడ్‌ను షేక్ చేశారు . అయితే ఎందుకో తెలియదు కానీ విజయ్ భాస్కర్ నెక్ట్స్ మూవీస్ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన జై చిరంజీవి డిజాస్టర్ కాగా.. అక్కడి నుంచి ఆయన డౌన్‌ఫాల్ స్టార్ట్ అయ్యింది. మధ్యలో ప్రేమ కావాలితో కమ్ బ్యాక్ ఇచ్చినా దానిని కొనసాగించలేకపోయారు. ఈ తరానికి కే విజయ్ భాస్కర్ అంటే ఎవరో తెలియనంతగా పరిస్ధితి మారిపోయింది.
లాంగ్ గ్యాప్ తర్వాత విజయ్ భాస్కర్ మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. తన తనయుడు శ్రీకమల్ హీరోగా , తాన్వీ ఆకాంక్షలను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉషా పరిణయం అనే సినిమాను ఆయన తెరకెక్కించారు. ఆగస్ట్ 2న విడుదలైన ఉషా పరిణయం మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా టాక్ తెచ్చుకుంది. కథాంశం కొత్తది కాకపోయినా దానిని ప్రజెంట్ చేసిన విధానం స్క్రీన్ ప్లేలో చక్కగా చూపించారు విజయ్ భాస్కర్. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులతో, లవ్ స్టోరీస్‌తో సరదాగా సాగిపోతుంది, సెకండాఫ్‌లో ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాలతో ఆకట్టుకుంది.

విజయ్ భాస్కర్ తొలినాళ్లలో చేసిన సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశారు. విజయ్ భాస్కర్ టేకింగ్‌కు త్రివిక్రమ్ రచన తోడు కావడంతో అవన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. తర్వాత ఎందుకో త్రివిక్రమ్- విజయ్ భాస్కర్ కలిసి పనిచేయలేదు. ఏమీ లేకపోతేనే ఏదో ఉందని రాసేసే ఈ సోషల్ మీడియా యుగంలో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని ఎన్నో వార్తలు వచ్చాయి. ఉషా పరిణయం మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న విజయ్ భాస్కర్ తన కెరీర్, వరుస ప్లాప్‌లపై కీలకవ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మనస్పర్ధలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మా మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదని.. స్క్రిప్ట్, డైలాగ్స్ బాలేదంటే బాలేదని సరదాగా చెప్పుకునేవాళ్లమని విజయ్ భాస్కర్ చెప్పారు. రైటర్‌గా, డైరెక్టర్‌గా త్రివిక్రమ్ చాలా బిజీగా ఉంటున్నారని.. తన సినిమాకు పనిచేయాలంటే ఎవరైనా సరే అన్ని వదిలేసి రావాలని , అలాగని ఆయనను అడగలేనని విజయ్ భాస్కర్ తెలిపారు. కెరీర్ ప్లానింగ్ విషయంలో త్రివిక్రమ్‌కు ఓ ఐడియా ఉందని.. తనతో వర్క్ చేసేటప్పుడు టైటిల్ కార్డ్స్‌లో తనను రైటర్ అని వేయొద్దని, అసిస్టెంట్ డైరెక్టర్ అని వేయాలని అడిగేవారని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు అప్పుడప్పుడే ఇండస్ట్రీలో కుదురుకుంటున్న సమయంలో త్రివిక్రమ్ వారికి సెట్ అయ్యే కథలను పట్టుకుని హిట్లు కొట్టాడని విజయ్ భాస్కర్ ప్రశంసించారు.
బిగినింగ్‌లో ఎలా ఉన్నామో ఇప్పటికీ తమ రిలేషన్ అలాగే ఉందని విజయ్ భాస్కర్ చెప్పారు. లైఫ్‌లో ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత కామ్‌గా ఉండాలని.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు అనేవాళ్లు మీడియాలో మాట్లాడరని, వాళ్ల గురించి మీడియానే మాట్లాడుతుందని, ఆ స్థాయికి త్రివిక్రమ్ చేరుకున్నారని ఆయన కొనియాడారు. ఫామ్‌లో ఉన్నప్పుడు కామ్‌గా ఉండాలని.. లేనప్పుడు యాక్టీవ్‌గా ఉండాలని విజయ్ భాస్కర్ సూచించారు. భాస్కర్ అనే పేరుని తనను ఉద్దేశించే వాడారని కొందరు లేనిపోనివి ప్రచారం చేశారని.. నిజానికి భాస్కర్ అంటే త్రివిక్రమ్ వాళ్ల నాన్నగారని విజయ్ భాస్కర్ తెలిపారు. ఆయన మాటలతోనైనా ఈ రూమర్స్‌కు చెక్ పడుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











