స్టార్ డైరెక్టర్ కొడుకు హీరోగా, కుమార్తె హీరోయిన్ గా.. లాంచ్ కి రెడీ !

దర్శకుడి కుమారుడు హీరోగా కుమార్ హీరోగా ఎంట్రీనా ? ఎవరా దర్శకుడు అనే అనుమానం మీకు కలగవచ్చు. ఆయన మరెవరో కాదు కె.విజయ భాస్కర్. ఇప్పటి తరం వాళ్ళకు ఆయన పెద్దగా పరిచయం ఉండి ఉండకపోవచ్చు కానీ 1991 నుంచి వరుస సూపర్ హిట్ సినిమాలు అందించిన ఆయన చివరిగా 2013లో మసాలా అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కెరీర్ మొత్తం మీద చేసింది 13 సినిమాలే అయినా నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ లాంటి అనేక హిట్ సినిమాలు అందించారు. అయితే ఒకపక్క ఆయన కుమారుడు హీరోగా లాంచ్ కావడానికి ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క ఆయన కుమార్తె కూడా హీరోయిన్ గా లాంచ్ కావడానికి ప్రయత్నాలు చేస్తుందట. ఈ విషయాన్ని తాజాగా ఆయన అల్లుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాలు మీ కోసం..

సూపర్ హిట్ సినిమాల దర్శకుడు

సూపర్ హిట్ సినిమాల దర్శకుడు

ఇప్పుడు పూర్తిగా డైరెక్షన్ కి దూరంగా ఉంటున్న ఆయన ఒకప్పుడు తెలుగు సినిమా రంగానికి పలు సూపర్ హిట్ సినిమాలు అందించారు. 1991లో ప్రార్థన అనే సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన తర్వాత స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి,జై చిరంజీవ, క్లాస్మేట్స్, భలే దొంగలు, ప్రేమ కావాలి, మసాలా లాంటి సినిమాలు తెరకెక్కించారు. అంతేకాక బాలీవుడ్లో కూడా తుజే మేరీ కసం అనే సినిమాను ఆయన డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఎందుకో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి కథలు సిద్ధం చేసుకున్నారని త్వరలోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

కుమారుడు హీరోగా, కుమార్తె హీరోయిన్ గా

కుమారుడు హీరోగా, కుమార్తె హీరోయిన్ గా

తాజాగా ఆయన అల్లుడు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. విజయభాస్కర్ అల్లుడి పేరు రవి శివతేజ పైలా. యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా ఆయన నటిస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ మెయిన్ లీడ్ గా వస్తున్న సూర్య వెబ్ సిరీస్ లో ఆయన స్వామి పాత్రతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ భాస్కర్ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ఆయన నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనే విజయ భాస్కర్ కుమారుడు, కుమార్తె గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

జిమ్ లో పరిచయం.. ప్రేమ పెళ్లి

జిమ్ లో పరిచయం.. ప్రేమ పెళ్లి

తాను సినిమాల మీద ఆసక్తితో గోదావరి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి సినిమా ప్రయత్నాలు చేసే వాడిని అలా చేస్తున్న సమయంలో ఒక రోజు జిమ్ లో పరిచయమైన విజయభాస్కర్ కుమార్తె శ్యామనితో ప్రేమలో పడ్డానని ఆయన చెప్పుకొచ్చాడు. ఆమె ఇంట్లో పరిచయం చేసిన ఏడు నెలల తర్వాత అన్నీ ఆలోచించి తమ ఇద్దరికీ విజయభాస్కర్ పెళ్లి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. తన భార్య తమ్ముడు హీరోగా, తన భార్య హీరోయిన్ గా లాంచ్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వీలైనంత త్వరలో ఆ ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నాను అని రవితేజ చెప్పుకొచ్చాడు.

Recommended Video

Uppena Movie First Day Collections | Vaishnav Tej Record
 కమెడియన్ కావడమే లక్ష్యం

కమెడియన్ కావడమే లక్ష్యం

ముక్కు మొహం తెలియని వాడిని కూడా నమ్మి తన కూతురు ప్రేమించిందని అన్న ఏకైక కారణంతో తనకు ఆమెను ఇచ్చి పెళ్లి చేశారని ఇప్పుడు చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నామని రవితేజ చెప్పుకొచ్చారు. అయితే అసలు ఆమె తండ్రి విజయ భాస్కర్ అన్న విషయం తెలిసిన వెంటనే భయపడి ఊరు పారిపోయానని ఆ తర్వాత మూడు రోజుల పాటు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నానని ఆయన ఆసక్తికర వివరాలు వెల్లడించారు. తర్వాత తనకు తానే స్థిమిత పడి మళ్ళీ హైదరాబాదుకు వచ్చానని అలా ప్రేమలో కంటిన్యూ అయి చివరికి పెళ్లి చేసుకుని స్థిరపడ్డామని ఆయన చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో కమెడియన్ గా స్థిరపడడం తన లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X