K Viswanath కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత.. విషాదంలో తెలుగు సినీ ప్రపంచం

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2 తేదీన (గురువారం) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. కళాతపస్వి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణంతో ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు. విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తాను. విశ్వనాథ్ వ్యక్తిగత, ప్రొఫెషనల్‌ విషయాల్లోకి వెళితే..

విశ్వనాథ్ వ్యక్తిగత జీవితం

విశ్వనాథ్ వ్యక్తిగత జీవితం

కే విశ్వనాథ్ అసలు పేరు కాశీనాథుని విశ్వనాథ్. తెనాలికి సమీపంలోని పులివర్రు గ్రామంలో 1930 ఫిబ్రవరి 19వ తేదీన సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. విజయవాడ, గుంటూరులో విద్యను అభ్యసించారు. గుంటూరు హిందూకాలేజీ, ఏసీ కాలేజీల్లోనూ జరిగింది. బీఎస్సీ డిగ్రీ అందుకొన్నారు. జయలక్ష్మీని వివాహం చేసుకొన్నారు. ఆయనకు ఒక కుమార్తె పద్మావతి దేవీ, ఇద్దరు కుమారులు నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్ ఉన్నారు.

51 చిత్రాలకు దర్శకత్వం

51 చిత్రాలకు దర్శకత్వం


భారతీయ సినిమా పరిశ్రమలో మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో 40, హిందీలో 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించడం ద్వారా డైరెక్టర్‌గా మారారు. శంకరాభరణం సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. తెలుగు సినిమా ప్రపంచంలోనే కాకుండా భారతీయ సినిమా రంగంలో ఆణిముత్యంగా మారింది.

విశ్వనాథ్ రూపొందించిన సినిమాలు

విశ్వనాథ్ రూపొందించిన సినిమాలు


సిరిసిరి మువ్వ, శుభోదయం, స్వర్ణకమలం, స్వాతికిరణం, సాగరసంగమం, స్వయంకృషి, అపద్బాంధవుడు, స్వర్ణకమలం, సిరివెన్నెల, శుభ సంకల్సం, సూత్రధారులు లాంటి అణిముత్యాలను అందించారు. ఆయన దర్వకత్వం వహించిన చివరి సినిమా శుభప్రదం కావడం గమనార్హం.

నటుడిగా విశ్వనాథ్

నటుడిగా విశ్వనాథ్


విశ్వనాథ్ నటుడిగా కూడా ప్రేక్షకులను మెప్పించారు.లాహిరి లాహిరి లాహిరిలో, అల్లరి రాముడు, సంతోషం, వజ్రం, స్వరాభిషేకం, నీ స్నేహం, శుభసంకల్పం, నరసింహనాయుడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఠాగూర్, అతడు, ఆంధ్రుడు, మిస్టర్ పర్‌ఫెక్ట్, కలిసుందాం రా చిత్రాల్లో నటించారు.

విశ్వనాథ్‌కు లభించిన అవార్డులు

విశ్వనాథ్‌కు లభించిన అవార్డులు


1992 సంవత్సరంలో పద్మశ్రీ, రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డును విశ్వనాథ్ అందుకొన్నారు. 2016లో దాదా సాహె్ ఫాల్కే అవార్డు అందుకొన్నారు. శంకరాభరణం చిత్రానికి జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం, సప్తపది చిత్రానికి 1982లో నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమ చిత్రం, సాగరసంగమం చిత్రానికి 1984లో జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డును అందుకొన్నారు.

More from Filmibeat

Read more about: vishwanath death no more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X