K విశ్వనాథ్ ఇంట్లో మరో విషాదం.. సతీమణి జయలక్ష్మి కన్నుమూత!
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా అలాగే నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కళాతపస్వీ K.విశ్వనాథ్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతి చెంది కొన్ని రోజులు కూడా కాకముందే ఆయన సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్రవిషధాన్ని నింపింది. భర్త చనిపోయిన బాధలోనే ఉన్న జయలక్ష్మి గారు ఇంకా కోలుకొని లేదు. ఇక 86 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూయడం అందరికీ షాక్ కు గురి చేసింది.
తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఇటీవల కుటుంబ సభ్యులు పలుమార్లు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆదివారం రోజు కూడా కొంత పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక ఆమె కొద్దిసేపటి అనంతరం చికిత్స అందుకుంటున్న సమయంలో గుండెపోటుతో మరణించినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు.

దర్శకుడు విశ్వనాథ్ ఫిబ్రవరి 2వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. ఆయన పలు అనారోగ్య కారణాల వలన కన్నుమూశారు. ఇక ఆ ఘటన జరిగి 24 రోజులు అయిన తర్వాతనే ఆయన సతీమణి కూడా మరణించడం విశ్వనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి మరణించిన కొన్ని రోజులకే తల్లి కూడా మరణించడంతో వారి పిల్లలు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. ఇక జయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు.
కె.విశ్వనాథ్ తెలుగులోనే కాకుండా హిందీ తమిళంలో కూడా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, అలాగే సిరివెన్నెల స్వర్ణకమలం స్వయంకృషి ఆపద్బాంధవుడు ఇలా ఎన్నో సినిమాలతో ఆయన బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇక ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని ఇటీవల సినీ ప్రముఖులు ప్రత్యేకంగా సంతాపం సభను కూడా నిర్వహించారు.


Click it and Unblock the Notifications











