twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌ కోసం కథ సిద్దం చేశా.. కళాపురం అంచనాలు పెంచిన కరుణ కుమార్

    |

    పలాస 1978, శ్రీదేవీ సోడా సెంటర్ చిత్రాలతో సామాజిక అంశాలపై అవగాహన, సామాజిక బాధ్యత ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న డైరెక్టర్ కరుణ కుమార్ తాజాగా రూపొందించిన చిత్రం కళాపురం. తన జోనర్‌కు భిన్నంగా సాధారణ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 26 తేదీన థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో కరుణ కుమార్ ఫిల్మీబీట్ తెలుగుతో మాట్లాడుతూ..

    గత చిత్రాల్లో మాదిరిగానే కథను నమ్ముకొని చేసిన సినిమా కళాపురం. సినీ దర్శకుడిగా మారాలని అనేక కష్టాలు అనుభవించి.. ఒక సినిమా అవకాశాన్ని పొందిన అంశం చుట్టు అల్లుకొన్న కథ ఇది. హాస్యం, ఫీల్‌గుడ్ అంశాలు ప్రతీ ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతాయి. కథ, కథనాలు ఆకట్టుకొంటాయి.కొత్త బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది అని కరుణ కుమార్ తెలిపారు.

    Director Karuna Kumar about Kalapuram movie and Pawan Kalyan.

    కళాపురం సినిమాను చూసిన సెన్సార్ అధికారులు ప్రశంసలు గుప్పించడం మా ఆత్మస్థైర్యాన్ని పెంచింది. అలాగే పవన్ కల్యాణ్ మా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా ఆనందం కలిగించింది. మా సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసేలా చేసిన పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు అని కరుణ్ కుమార్ తెలిపారు.

    అయితే పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనేది నా కోరిక. పవర్ స్టార్ స్టామినాకు తగిన కథ నా వద్ద ఉంది. ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులు, రాజకీయాలపరంగా బిజీగా ఉన్నారు. ఒకవేళ సమయం చిక్కితే పవన్ కల్యాణ్ కథ చెబుతాను అని కరుణ కుమార్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

    English summary
    Director Karuna Kumar's latest movie is Kalapuram. It has been in the news for a long time now. Just a few days left for the film to hit the big screens. The film has created much buzz among the audience. Karuna Kumar shared how confident he is about Kalapuram
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X