Acharya Pre Release Event: మెగాస్టార్ నిజమైన ఆచార్య.. రాజమౌళికి ప్రత్యేకంగా థాంక్స్: కొరటాల శివ

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆచార్య సినిమా ఈనెల 29న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మెగా ప్రొడక్షన్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తో వర్క్ చేస్తున్న మరికొంత మంది దర్శకులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ ఈ ఈవెంట్ లో తనదైన శైలిలో మాట్లాడారు.

నిజమైన ఆచార్య

నిజమైన ఆచార్య

కొరటాల శివ మాట్లాడుతూ.. మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగాను అని చెప్పి ఆయన వయసు నేను తగ్గించలేను.. కాకపోతే ఆయన సినిమాలు టికెట్ల కోసం మాత్రం చొక్కాలు చించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆయనను సినిమా షూటింగ్ లో చూస్తే చాలు అనుకున్న నేను ఈరోజు కెమెరా ముందు ఆయనకు యాక్షన్ చెప్పే అవకాశం జరిగింది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని నాకు కలిగించిన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాతో నాకు నిజంగా ఒక నిజమైన ఆచార్య గారు దొరికారు. నిజానికి చిరంజీవి గారు గొప్ప డాన్సర్ గొప్ప యాక్టర్ అని అంటూ ఉంటారు.

వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు

వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు

కానీ ఆయనలో నేను ఎన్నో మంచి విషయాలు కూడా నేర్చుకున్నాను నాతోపాటు ఈ సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అందుకు వాళ్లు నాకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. నిర్మాతలు నిరంజన్ అన్వేష్ ఇద్దరు కూడా సినిమా కోసం ఏది అడిగితే అది ఇచ్చారు. ధర్మస్థలి అనే సెట్ కోసం కూడా వాళ్ళు చాలా ఖర్చు చేశారు. ఇంత బాగా సపోర్ట్ చేసిన ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు.

నాకంటే ఒక పెద్ద కల కన్నాడు..

నాకంటే ఒక పెద్ద కల కన్నాడు..

సినిమాటోగ్రాఫర్ తిరు నాకు ప్రాణం. ఇంతకుముందు ఆయనతో కూడా సినిమాలు చేశాను. అయినా సినిమాకు నాకంటే ఒక పెద్ద కల కన్నాడు. ఆయన వర్క్ చాలా ఉపయోగపడింది. ఆర్ట్ వర్క్ సురేష్ కూడా అద్భుతమైన వర్క్ చేశాడు. సంగీత దర్శకుడు మణిశర్మ కూడా మంచి మ్యూజిక్ అందించారు.

వెంటనే ఓకే చెప్పేసారు...

వెంటనే ఓకే చెప్పేసారు...

రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. మొదట ఈ కథ చెబుతున్నప్పుడు ఆయన నిర్మాత కాబట్టి కథ చెప్పడానికి వచ్చాను అని అనుకున్నారు. ఇక కథ మొత్తం చెప్పిన తర్వాత సిద్ధా అనే ఒక మంచి క్యారెక్టర్ ఉంది.. అది మీరు చేయాలి అన్నప్పుడు వెంటనే ఓకే చెప్పేసారు. ఆ తర్వాత ఆయన ఎంతో మెప్పించడం కోసం ఓకే చెప్పినట్టు కాకుండా.. క్యారెక్టర్ నచ్చి చేస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా నాన్న గారితో చేసే అవకాశం ఎప్పుడు కలుగుతుందో తెలియదు కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయన థాంక్స్ అని అన్నారు. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

 రాజమౌళికి థాంక్స్

రాజమౌళికి థాంక్స్

ఇక రాజమౌళి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి. ఆయన RRR సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నప్పుడు ఆచార్య కోసం డేట్స్ కావాలి అన్నప్పుడు సపోర్ట్ చేసిన విధానం ఎంతగానో ఉపయోగపడింది. అందుకు స్పెషల్ గా థాంక్స్ చెబుతున్నాను. ఫైనల్ గా ఈ సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం చాలామంది నాలుగేళ్లు కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమాను చూసి మీరు ఆశీర్వదిస్తారని ఘన విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నట్లు కొరటాల శివ మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X