Drugs Case డైరెక్టర్ క్రిష్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. డ్రగ్స్ కేసులో పరారీలో స్టార్ డైరెక్టర్!

తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని రాడిసన్ పబ్‌లో జరిగిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులపై కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇటీవల రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ పార్టీని తెలంగాణ పోలీసులు బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దర్శకుడు క్రిష్ మెడకు ఈ కేసు ఉచ్చు బిగుసుకొంటున్నది. ఈ కేసులో క్రిష్ పాత్ర గురించిన వివరాల్లోకి వెళితే..

రాబిసన్ పబ్ డ్రగ్స్ పార్టీలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలించడం పూర్తయిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీ జరిగినప్పుడు కొన్ని సీసీటీవీ కెమెరాలను పనిచేయకుండా చేశారు. మొత్తం 209 కెమెరాలు ఉండగా.. డ్రగ్స్ జరిగిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా చేశారు అనే విషయాన్ని పోలీసులు వెల్లడించారు.

Director Krish Jagarlamudi absconded for Hyderabads Radison Hotel Drug Case

డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో దర్శకుడు క్రిష్‌ పేరును 8వ వ్యక్తిగా చేర్చారు. అయితే పోలీసులకు చిక్కకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారనే విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుండా ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారని తెలిపారు.

డ్రగ్స్ కేసులో ఇరుక్కొన్న డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం ముంబైలో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. అయితే శుక్రవారం క్రిష్ విచారణకు హాజరుకావొచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ కేసులో క్రిష్ ఎలాంటి విచారణను ఎదుర్కొంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Director Krish Jagarlamudi absconded for Hyderabads Radison Hotel Drug Case

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నిర్భయ్ సింధి, కేదారినాథ్ సల్గమ్‌శెట్టి, సయ్యద్ అలీ జాఫరీ, గడ్డాల ప్రవీణ్‌ను కేసులో ప్రధాన నిందితులుగా నమోదు చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున కొకైన్, ఇతర నిషేధిత మాదక ద్రవ్యాలు ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకొని పంచనామా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X