హరి హర వీరమల్లు విషయంలో క్రిష్ బిగ్ మిస్టేక్.. రాజమౌళిలా మారిపోయేవాడు!

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లముడి పేరు ఈ సమయానికి మారుమోగాల్సింది. హరి హర వీరమల్లు చిత్రానికి ఆయన దర్శకుడిగా కొనసాగించే ఈపాటికి అదే జరిగేదని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశాన్ని ఆయన కాస్తా ఓపిగ్గా సద్వినియోగం చేసుకోవాల్సిందని అంటున్నారు. కొద్దిలో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా మారే అవకాశాన్ని చేజార్చుకున్నారని, అతని టాలెంట్ కు, విజన్ కు తోడు పవన్ కళ్యాణ్ ద్వారా నెక్ట్స్ లెవల్ కు వెళ్లేవారని అంటున్నారు. ఇంతకీ క్రిష్ జాగర్లముడి చేసిన పొరపాటు ఏంటీ అనే వివరాల్లోకి వెళ్లితే..

2008 నుంచి క్రిష్ కెరీయర్ ప్రారంభం..
క్రిష్ జాగర్లముడి గుంటూరులో పుట్టి పెరిగారు. యూఎస్ లో ఫార్మసీ కంపూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో సెట్ అయ్యారు. అల్లరి నరేశ్, శర్వానంద్ హీరోలుగా 'గమ్యం' సినిమాను తెరకెక్కించి 2008లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. తొలిచిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్, మనోజ్ లతో డిఫరెంట్ అటెంప్ట్ చేశారు. అదే చిత్రాన్ని తమిళంలోనూ వనంగా రీమేక్ చేశారు. కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ : మహానాయుడు, కొండ పొలం వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. అలాగే హిందీలోనూ అక్షయ్ కుమార్ తో 'గబ్బర్ ఈజ్ బ్యాక్', 'మణికర్ణిక' వంటి చిత్రాలతోనూ నార్త్ లో తన ముద్ర వేసుకున్నారు.

Director Krish Jagarlamudi is wrong about Pawan Kalyans Hari Hara Veeramallu

వరుసగా 4 చిత్రాలతో దెబ్బ..
గత నాలుగు చిత్రాలతో క్రిష్ జాగర్లముడికి ప్రేక్షకుల నుంచి దారుణమైన ఫలితాలు వచ్చారు. చివరిగా క్రిష్ జాగర్లముడి ఎన్టీఆర్ : కథానాయకుడు, ఎన్టీఆర్ : మహానాయకుడు, మణికర్ణిక, కొండ పొలం వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రాలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. డిజాస్టర్ డైరెక్టర్ గా మారిపోతున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. 2020లోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అప్పటి వరకు క్రిష్ కు గతంలోనూ భారీ హిట్ సినిమాలేవీ లేవు. కానీ విభిన్న కథలను, ప్రమోగాత్మక చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారనే పేరు మాత్రం దక్కించుకున్నారు.

హరి హర వీరమల్లు విషయంలో మిస్టేక్?
క్రిష్ జాగర్లముడికి టాలీవుడ్ లో బిగ్ స్టార్స్ తో కలిసి పని చేసే అవకాశం పెద్దగా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఆ అవకావాన్ని అందించారు. హరి హర వీరమల్లుకు క్రిష్ డైరెక్టర్ గా అనౌన్స్ అవ్వడంతో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. అయితే హరి హర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ద్వారా ఐదేళ్లు ఆలస్యమైంది. క్రిష్ కూడా హరి హర వీరమల్లు చిత్ర షూట్ ను ప్రారంభించి కొంత ఫుటేజీని తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ బిజీ అవ్వడంతో ప్రాజెక్ట్ డిలే అయ్యింది. ఆ తర్వాత కొద్ది నెలలు వెయిట్ చేసిన క్రిష్ తనకు ఉన్న కమిట్ మెంట్స్ ద్వారా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

దాంతో ఏంఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. మొత్తానికి పూర్తి చేశారు. అయితే క్రిష్ కాస్తా ఓపిక పట్టి ఉంటే.. ఇప్పుడు హరి హర వీరమల్లు క్రెడిట్ మొత్తం ఆయనే దక్కేదని అంటున్నారు. క్రిష్ తప్పుకోవడంతో క్రెడిట్ మొత్తం నిర్మాతకు, జ్యోతి కృష్ణకు వెళ్లింది. పైగా వారిద్దరికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పారంట. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం, ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత తొలిసారిగా హరి హర వీరమల్లుతో వెండితెరపైకి రాబోతుండటంతో సినిమాకు భారీ విజయం లభిస్తుందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా క్రిష్ కెరీయర్ కూడా నెక్ట్స్ లెవల్ కు వెళ్లేదని, బిగ్ స్టార్స్ తో ఫుల్ బిజీ అయ్యేవారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X