పవర్ స్టార్ అభిమానులకు డైరెక్టర్ క్రిష్ ఛాలెంజ్.. ఇలా ఎవరైనా సవాల్ చేయగలరా?

నిత్యం సినిమా ప్రపంచంలో బిజీగా గడిపే సినీ తారలు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య కాలాన్ని గడిపేస్తున్నారు. సినీ తారలు లాక్ డౌన్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే అర్ధమవుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకరికొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. ప్రస్తుతం #BetheRealman ఛాలెంజ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

 కీరవాణి ఇచ్చిన ఛాలెంజ్..

కీరవాణి ఇచ్చిన ఛాలెంజ్..

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో పని చేస్తూ దర్శకుడు క్రిష్ జాగర్లమూడిని కూడా ఈ ఛాలెంజ్ కోసం నామినేట్ చేశారు. అందుకు క్రిష్ కూడా తనదైన శైలిలో టాస్క్ పూర్తి చేసి వీడియో షేర్ చేశారు. గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఆ తరువాత తల్లికి ప్రేమగా వంట చేసి పెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

పవర్ స్టార్ అభిమానులకు ఛాలెంజ్..

పవర్ స్టార్ అభిమానులకు ఛాలెంజ్..

అందరు సినిమా తారలు ఒక విధంగా ఆలోచిస్తే క్రిష్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించాడు. ఛాలెంజ్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను నామినేట్ చేయడం అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను నామినేట్ చేసిన క్రిష్ అందరూ ఇంట్లో ఉన్న మహిళలకు హెల్ప్ చేయాలని అన్నారు.

ఇలా ఎవరైనా చేస్తారా..

ఇలా ఎవరైనా చేస్తారా..

క్రిష్ పవన్ అభిమానులను నామినేట్ చేయడం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇలా ఎవరైనా సింపుల్ అండ్ బెస్ట్ గా ఆలోచించగలరా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఓ విధంగా క్రిష్ ఆయన అభిమానులను ఎంతగా ఇష్టపడుతున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

Krrish 4 To Be a Multi Starrer Targets RRR Movie
 నెక్స్ట్ ఇయర్ పవన్ సినిమా..

నెక్స్ట్ ఇయర్ పవన్ సినిమా..

దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హిస్టారికాల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాకు ఇప్పటికే విరుపాక్షి అనే టైటిల్ ని కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా సినిమా పనులు ఆగిపోవడంతో సినిమా షెడ్యూల్స్ కోసం కొత్త ప్లాన్ వేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్టు వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X