Ramyakrishna తో విబేధాలు.. పెళ్లిపై ఆసక్తి లేకపోయినా అలా జరిగింది: కృష్ణవంశీ

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. అప్పట్లో ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అయ్యేవి. ముఖ్యంగా ఆయన అనుకున్న కథను చాలా బలంగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అభిమానుల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అనే చెప్పాలి.

మరి కొన్ని రోజుల్లో రంగ మార్తండ సినిమాతో ఆకట్టుకునేందుకు సిద్ధమైన కృష్ణవంశీ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. రమ్యకృష్ణతో ఒకప్పుడు విభేదాలు వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు..

 నచ్చని పని చేయను

నచ్చని పని చేయను

ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒకటి సరికొత్త కథను ప్రేక్షకులకు అందించాలని ఆలోచించే అతి కొద్ది మంది దర్శకులు కృష్ణవంశీ ఒకరు. కమర్షియల్ గా కాకుండా ప్రజలకు మనం ఏం చెబుతున్నామనే విషయాన్ని కూడా ఆయన చాలా బలంగా ఆలోచిస్తారు. ఆ కారణంగానే తాను పెద్దగా కమర్షియల్ సినిమాలు చేయలేదు అని ఎవరైనా తనను అలా చేయమని చెప్పినా కూడా నచ్చని పని ఎప్పుడూ చేయలేదు అని అన్నారు.

డిజాస్టర్ వచ్చినా..

డిజాస్టర్ వచ్చినా..

డబ్బు పోయినా కూడా కొన్ని సందర్భాల్లో మంచి పేరు వచ్చింది. డబ్బు అనేది తర్వాత కూడా సంపాదించుకోవచ్చు. కానీ మంచి పేరు సంపాదించుకోవడం గొప్ప విషయం అనే ఫార్ములా మాత్రమే నాకు తెలుసు. సింధూరం సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సినిమా ద్వారా తనకు ఒక గౌరవం గుర్తింపు దక్కుతుందని అన్నారు.

పెళ్లి వద్దని అనుకున్నా..

పెళ్లి వద్దని అనుకున్నా..

ఇక కృష్ణవంశీ ఒకానొక సమయంలో అయితే అసలు పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను. అనవసరంగా బంధుత్వం బాంధవ్యాలు.. ఇలాంటి ఎమోషన్స్ లేకుండా సోలాగా బ్రతకాలని అనుకున్నా. కానీ ఆ తర్వాత రమ్యకృష్ణ నన్ను పెళ్లి చేసుకుంది. అది అనుకోకుండా జరిగిపోయింది. ఫైనల్ గా మనకి ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అని నేను నమ్ముతాను.. అని కృష్ణవంశీ తెలియజేశారు.

రమ్యకృష్ణతో విబేధాలు

రమ్యకృష్ణతో విబేధాలు

అయితే గతంలో చాలాసార్లు కృష్ణవంశీ రమ్యకృష్ణకు ఇద్దరికి కూడా చాలాసార్లు విభేదాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. వారిద్దరు కూడా విడిపోతున్నట్లుగా కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ కూడా వినిపించింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే కృష్ణవంశీ అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఎప్పుడూ కూడా రమ్యకృష్ణ తన వ్యక్తిగత జీవితానికి అడ్డుపడింది లేదు. నాకు నచ్చినట్లుగానే నా జీవితాన్ని కొనసాగించేలా చేసింది. అలాగే తనకు ఇష్టమైన సినిమాలు చేసుకుంటూ ఆమె స్వేచ్ఛగానే ఉంటుంది.. అని కృష్ణవంశీ వివరణ ఇచ్చారు.

రంగమార్తాండ

రంగమార్తాండ

ఇక కృష్ణవంశీ డైరెక్టర్ చేసిన రంగమార్తాండ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే బ్రహ్మానందం మొదటిసారి కామెడీ పాత్రలో కాకుండా ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నేటి తరం మర్చిపోతున్న ఒక ఎమోషనల్ మూమెంట్ ను చూపించబోతున్నట్లు కృష్ణవంశీ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X