రమ్యకృష్ణతో విడాకులు.. కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్

శివ చిత్రంతో తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వద్ద పనిచేసిన ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లను దర్శకులుగా నిలబెట్టారు. ఇలాంటి వారిలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒకరు. గురువుగా పూర్తి భిన్నంగా ఉమ్మడి కుటుంబాలు, బంధాలు, బంధుత్వాలు, దేశభక్తి వంటి ఎలిమెంట్స్ కృష్ణవంశీ సినిమాల్లో కనిపిస్తాయి. డిఫరెంట్ టేకింగ్‌తో అద్భుతాలు సృష్టించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎందుకో ఈ మధ్యన స్లో అయ్యారు.

తండ్రి ఉద్యోగరీత్యా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పెరిగిన కృష్ణవంశీ పూర్తి పేరు .. పసుపులేటి వెంకట బంగార్రాజు. చదువు పూర్తి చేసిన తర్వాత పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్, డైరెక్షన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. అగ్రాలో ఎంఏ ఎకనమిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కృష్ణవంశీ తొలుత డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ఆరంభించారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రానికి పంపిణీదారుగా వ్యవహరించి కళ్లు చెదిరే లాభాలను అందుకున్నారు. అయితే ఆ తర్వాత కృష్ణవంశీ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు నష్టాలు తీసుకొచ్చాయి.

director krishna Vamsi gave clarity about divorce with her wife ramya krishnan

దీంతో మద్రాస్‌లో లైట్‌బాయ్‌గా , అసిస్టెంట్ కెమెరామెన్‌గా 24 విభాగాలపై పట్టు సాధించారు. ఈ దశలో శివ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిన ఆయన క్షణక్షణం, రాత్, అంతం, గాయం అనగనగా ఒక రోజు వంటి చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత గులాబీ చిత్రంతో కృష్ణవంశీని డైరెక్టర్‌ను చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన పనితనం నచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోలో నిన్నే పెళ్లాడతా చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కృష్ణవంశీ వెనుదిరిగి చూసుకోలేదు.

సింధూరం, చంద్రలేఖ, అంత:పురం, సముద్రం, మురారి, ఖడ్గం, శ్రీఆంజనేయం, చక్రం, డేంజర్, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, మహాత్మా, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం వంటి చిత్రాలు తీశారు. కృష్ణవంశీ సినిమాలలలో దేశభక్తి, జాతీయత, కుటుంబ బంధాలు వంటి వాటికి పెద్ద పీట వేస్తారు. 2017 తర్వాత ఆరేళ్లు గ్యాప్ తీసుకున్న ఆయన రంగమార్తండతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యారు. అలనాటి అగ్ర కథానాయిక రమ్యకృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కృష్ణవంశీ. ఈ దంపతులకు ఓ కుమారుడు సంతానం.

director krishna Vamsi gave clarity about divorce with her wife ramya krishnan

ఇటీవలి కాలంలో రమ్యకృష్ణ- కృష్ణవంశీలు విడాకులు తీసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ స్పందించారు. మా మంచి కోరేవాళ్లే .. మాకేమైనా జరుగుతుందేమోనని ఇలాంటివి పుట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. రమ్య చెన్నైలో, నేను హైదరాబాద్‌లో ఉంటున్నామని.. వీలు కుదిరినప్పుడల్లా ఇద్దరం కలుసుకుంటూనే ఉంటామని ఆయన తెలిపారు.

రమ్యకృష్ణ ఫ్యామిలీని, కెరీర్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తారని ఆవిడ ఎంతో తెలివైన వ్యక్తని కృష్ణవంశీ ప్రశంసించారు. మేమిద్దరం పార్టీలకు , ఫంక్షన్‌లకు వెళ్తూనే ఉంటామని కానీ వాటికి సంబంధించిన ఫోటోలు పూర్తిగా మా వ్యక్తిగతమని అందుకే వాటిని షేర్ చేసుకోకపోవడంతో మా మధ్య దూరం పెరిగిందని, విడాకులు తీసుకున్నామని కథలు అల్లేస్తున్నారని కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాటలతో ఈ పుకార్లకు చెక్ పడుతుందా? లేదా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X