నేను చనిపోయానని అనుకొన్నా.. చిరంజీవి అలా బతికించాడు.. కృష్ణవంశీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన విలక్షణ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. సామాజిక అంశాలు, దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ సంబంధాలు ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన కృష్ణవంశీ కూడా అంతుచిక్కరు. కానీ గురువు భావాలూ ఆయనతో కనినించవు. తొలుత అనగనగా ఒకరోజు సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత కృష్ణవంశీకే దక్కింది. కానీ ఆ చిత్ర బడ్జెట్ పరిధి దాటిపోతుండటంతో డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించారు. కానీ కృష్ణవంశీలోని ప్రతిభ, చురుకుదనం గమనించిన ఆర్జీవీ.. తనే ప్రొడ్యూసర్‌గా గులాబీ చిత్రం ద్వారా దర్శకుడిని చేశారు.

రెండో చిత్రానికే ఏకంగా ఏకంగా కింగ్ నాగార్జునతో సినిమా తీసే ఛార్స్ కొట్టేసిన కృష్ణవంశీ నిన్నే పెళ్లాడతాతో బ్లాక్‌బస్టర్ కొట్టారు. సింధూరంతో నక్సలైట్లు, పోలీసుల మధ్య సామాన్య ప్రజలు ఎలా నలిగిపోతున్నారో చూపించారు. అంత:పురం, సముద్రం, మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, చక్రం, డేంజర్, రాఖీ, చందమామ, మహాత్మ, గోవిందుడు అందరివాడే వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తన మార్క్ చూపించారు. ఈ మధ్య ఎందుకో కృష్ణవంశీ జోరు తగ్గింది అనుకునేలోగా గతేడాది రంగమార్తాండతో వచ్చి సందడి చేశారు కృష్ణవంశీ.

director krishna vamsi made interesting comments about megastar chiranjeevi

ఆయన ప్రతి సినిమాలోనూ ఎంతో పరిణితి కనిపిస్తుంది. ఇప్పటికీ తనను తాను మార్చుకుంటూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కృష్ణవంశీ. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను అందంగా చూపించే డైరెక్టర్లలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తర్వాతి స్థానం కృష్ణవంశీదే. రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తన చిత్రాల్లో పనిచేసిన సంఘవి, మహేశ్వరి, సోనాలి బింద్రే, రమ్యకృష్ణ, సౌందర్య, ఛార్మి, కాజల్ అగర్వాల్, జెనీలియా, భావన, అనుష్క శెట్టి అందాలను స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు కృష్ణవంశీ. ఈ సినిమాలు ఆయా హీరోయిన్ల కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

రంగమార్తాండ తర్వాత కృష్ణవంశీ మరో కొత్త ప్రాజెక్ట్ ఏది అనౌన్స్ చేయలేదు. ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగానే ఉన్నా కృష్ణవంశీయే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కానీ ఒకానొక దశలో సినిమాలన్నీ ఫ్లాప్ కావడం, చేతిలో సినిమాలు లేకపోవడంతో జీవితం ఎలా ఉందో.. ఎటు పోతుందో అర్ధం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో దర్శకుడిగా చనిపోయాననే ఫీలింగ్ ఉండేది. కానీ చిరంజీవి అవకాశం ఇచ్చి నన్ను బతికించాడు. కానీ తాను ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకుని రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలా సినిమా తీసే అవకాశాన్ని చిరంజీవి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

ఇప్పుడే కాదు జీవితంలో చాలా సందర్భాల్లో అన్నయ్య చిరంజీవి తనకు అండగా నిలుస్తూ వచ్చారని తెలిపారు. ఒక యాడ్ ఫిలిం షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయన రూ.కోటి విలువైన కారులో సెట్‌కి వచ్చారని .. తనకు అలాంటి కార్లంటే ఇష్టం కావడంతో అన్నయ్య.. నాకు ఈ కారు గిఫ్ట్‌గా ఇచ్చేయొచ్చుగా అని సరదాగా అన్నానని కృష్ణవంశీ తెలిపారు.

కానీ కొద్దిరోజుల తర్వాత చిరంజీవి తనను ఇంటికి పిలిపించి .. ఈ కారు నీకే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పారని తెలిపారు. తాను వద్దు అనడంతో నన్ను అన్నయ్య అని పిలుస్తున్నావ్.. మీ అన్నయ్య ఇస్తే తీసుకోవా అని బలవంతం పెడితే తీసుకోక తప్పలేదన్నారు. ఆ కారుతో ఎన్నో సాహసాలు చేశానని.. ఓసారి నందిగామ నుంచి వస్తుండగా చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, ప్రాణాలే పోవాల్సిన చోట బతికి బయటపడ్డానంటే చిరంజీవి ఇచ్చిన కారువల్లేనని ఆయన వెల్లడించారు.

తన జీవితంలో డ్రీమ్ ప్రాజెక్ట్‌ 'వందేమాతరం' సినిమాను కేవలం చిరంజీవితో తీయాలని అనుకుంటున్నానని.. ఎప్పటికైనా తీస్తానని కృష్ణవంశీ ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్‌లో చిన్నప్పటి నుంచి ఉన్న సంస్కారం ఇప్పటికీ మారలేదన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X