Krishna Vamsi: రమ్యకృష్ణతో విడాకులు.. డైరెక్టర్ కృష్ణవంశీ ఏమన్నారంటే?
Ramya Krishnan- Krishna vamsi Divorce: టాలీవుడ్‌లో లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ లో రమ్యకృష్ణ- కృష్ణవంశీల జోడీ ఒకటి. వీరిద్దరి ప్రేమ కథ అందరికీ తెలిసిందే. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ మూవీ షూటింగ్ లో వీరి మధ్య ప్రేమ చిగురించిందట. ఆతర్వాత పెద్దల సమక్షంలో మూడు మూళ్ల బంధం ఒక్కటయ్యారు. ఏడడుగులు నడిచి వారి బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు. వారి సంసార జీవితం సాఫీగా సాగుతున్నా.. గత కొద్దికాలంగా రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోయారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా డైరెక్షర్ కృష్ణవంశీ అసలు విషయాన్ని మరోసారి బయటపెట్టేశాడు.
ఖడ్గం రీ-రిలీజ్ సందర్భంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ..రమ్యకృష్ణతో విడాకుల రూమర్ల మీద కూడా స్పందించాడు. తాను షూటింగ్ పనుల నిమిత్తం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాననీ, రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుందని అన్నారు. ఈ కారణంతోనే ఇద్దరం విడిపోయారని, అందుకే ఇలా విడివిడిగా ఉంటున్నాడని రూమర్లు వస్తున్నాయన్నారు. ఈ క్రమంలోనే విడాకులు కూడా తీసుకొంటున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియోలో గుప్పుమంటున్నాయి. గతంతో కూడా తాను చాలాసార్లు ఖండించాడు కృష్ణవంశీ. అలాంటి రూమర్లు వ్యాప్తి చేయడం శాడిస్టిక్ థింగ్స్, అలాంటి వారిని చూస్తుంటే నవ్వు వస్తుంది. ఆ రూమర్లలో ఎలాంటి నిజం లేదన్నారు.

ఆ రూమర్సు క్రియేట్ చేసింది కూడా తమ మీద అభిమానంతోనే క్రియేట్ చేశారని, అయ్యో పాపం అలా దూరంగా ఉంటున్నారే అని ఫీల్ అయి క్రియేట్ చేశారే కావచ్చు అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు కృష్ణవంశీ. అలాగే.. మేమిద్దరం కలిసి ఏ ఫంక్షన్స్ కానీ, ప్రోగ్రామ్స్ గాని అటెండ్ కాకపోవడం వల్ల ఇలాంటి రూమర్స్ క్రియేట్ అయి ఉండొచ్చని కృష్ణవంశీ భావించారు. కానీ, ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ గాని, ప్రైవేట్ ఫంక్షన్స్ గాని కచ్చితంగా తన ఇద్దరం కలిసి వెళ్తామని, కానీ, ఆ ఫోటోలను తామెప్పుడు సోషల్ మీడియాలో పంచుకోమని అది మా వ్యక్తిగత జీవితం అంటూ చెప్పుకోచ్చారు.
తామిద్దరం వాటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాం. మేము ఏంటో.. ఆ బంధమేంటో మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇంట్లోకి వెళ్లాక మా ఇద్దరి ప్రపంచం వేరన్నారు. మా గురించి తెలిసిన వారు కూడా ఆ ఫోటోస్, వీడియోస్ బయటపెట్టరన్నారు. అలాగే రమ్యకృష్ణ గురించి చెబుతూ.. ఆమె చాలా ఫన్ అండ్ లవింగ్ పర్సన్ అని, అంతకుమించి చాలా షార్ప్ అని అండ్ చాలా స్మార్ట్ అని తన భార్య రమ్యకృష్ణను పొగడ్తలతో ముంచేస్తారు కృష్ణవంశీ. తన ఫ్యామిలీని రామకృష్ణ ఎంతో బాగా సుకుంటున్నాయి. ఆమె చాలా ఇంటలిజెంట్ అని చెప్పుకొచ్చారు.

అలాగే మురారి సినిమా రి రిలీజ్ సమయంలో చాలామంది థియేటర్లలోనే పెళ్లిళ్లు చేసుకున్నారు ఆ విషయంపై కృష్ణవంశీ మాట్లాడటం షాకింగ్ కామెంట్స్ చేశారు. అలా చేయడం చాలా తప్పని, మన దేశంలో పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం అని ఆ విషయం తెలియక చాలామంది అలా ప్రవర్తించారని తెలిపారు. కేవలం పెళ్లంటే ఇద్దరు మనుషులు మధ్య బంధం కాదని, రెండు కుటుంబాల కలయికని చెప్పుకొచ్చారు. వీరిద్దరూ కలిసి తర్వాత జనరేషన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రక్రియ అని తెలిపారు.


Click it and Unblock the Notifications











